Bird Flu | బర్డ్‌ఫ్లూ అలజడి.. అమెరికాలో ఆవుల్లో హెచ్5ఎన్1 వైరస్
కొవిడ్ సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మానవాళిపై మరో మహమ్మారి పంజా విసరబోతున్నదా ? కరోనాను మించి ప్రాణనష్టం చేయబోతున్నదా ? అంటే అవుననే అంటున్నారు నిపుణులు.
- డెయిరీ ఫామ్ కార్మికుడికి పాజిటివ్
- మొదటిసారి పశువు నుంచి మనిషికి
- కొవిడ్ కంటే 100 రెట్లు ప్రాణాంతకం
- మరో మహమ్మారి ముప్పు: నిపుణులు
Bird Flu | న్యూయార్క్, ఏప్రిల్ 5: కొవిడ్ సృష్టించిన విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న మానవాళిపై మరో మహమ్మారి పంజా విసరబోతున్నదా ? కరోనాను మించి ప్రాణనష్టం చేయబోతున్నదా ? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. అయితే, ఈసారి కొత్తగా ఏ వైరస్ పుట్టుకు రావాల్సిన అవసరం లేదని, ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పక్షులు, కోళ్లలో వ్యాపిస్తున్న బర్డ్‌ఫ్లూ హెచ్5ఎన్1 రకం వైరస్.. మహమ్మారిగా మారి దాడి చేసే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అమెరికాలో ఆవుల మందల్లో హెచ్5ఎన్1 వైరస్ సోకుతున్నది. కాన్సాస్, న్యూమెక్సికో, టెక్సాస్, ఓహియో, ఇడాహో, మిషిగన్‌లో పాడి పశువులకు బర్డ్‌ఫ్లూ సోకినట్టు గుర్తించారు. పక్షుల ద్వారా పశువులకు వైరస్ సోకినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు.
డెయిరీఫామ్ కార్మికుడికి వైరస్
టెక్సాస్‌లోని ఓ డెయిరీఫామ్‌లో పని చేసే కార్మికుడికి కూడా బర్డ్‌ఫ్లూ సోకినట్టు గుర్తించారు. వైరస్ సోకిన ఆవులను తాకడం వల్ల అతడు వైరస్ బారిన పడ్డట్టు భావిస్తున్నారు. పశువుల నుంచి మనిషికి బర్డ్‌ఫ్లూ సోకడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు 2022లోనూ అమెరికాలోని కొలరాడోలో ఒక వ్యక్తికి వైరస్ సోకినప్పటికీ అతడికి కోళ్ల నుంచి సోకింది.
మరణాల రేటు ఎక్కువ
బర్డ్‌ఫ్లూని ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా అని పిలుస్తారు. ఇందులో అనేక వేరియంట్లు ఉన్నప్పటికీ హెచ్5ఎన్1, హెచ్7ఎన్9కు మాత్రమే మనుషులకు సోకే సామర్థ్యముంది. హెచ్5ఎన్1 వైరస్‌ను తొలిసారి 1996లో చైనాలోని పక్షుల్లో గుర్తించారు. ఆ తర్వాత ఏడాది హాంకాంగ్‌లో వైరస్ పక్షుల నుంచి మనుషులకు వ్యాపించింది. 18 మంది వైరస్ బారిన పడగా ఆరుగురు మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2003 నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 887 మంది హెచ్5ఎన్1 బర్డ్‌ఫ్లూ బారిన పడగా 462 మంది మరణించారు. వైరస్ బారిన పడుతున్న ప్రతి 100 మందిలో 52 మంది మరణిస్తున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. కొవిడ్‌లో మరణాల రేటు 0.1 శాతం మాత్రమే ఉన్నప్పటికీ లక్షలాది మందిని బలిగొన్నది. హెచ్5ఎన్1లో మరణాల రేటు 52 శాతం కాబట్టి ఇది కొవిడ్ కంటే 100 రెట్లు ప్రాణాంతకం కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

