2000 రాకెట్లు వదిలిన ఉగ్రవాదులు.. హమాస్ టన్నెళ్లపై ఐడీఎఫ్ భీకర దాడి

గాజా: ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య మళ్లీ ప్రచ్చన్న యుద్ధం మొదలైంది. గత అయిదు రోజుల నుంచి ఆ రెండు దేశాలు రాకెట్ల దాడితో బీభత్సం సృష్టిస్తున్నాయి. గాజాలో ఉన్న పాలస్తీనా ఉగ్రవాదులు ఇప్పటి వరకు సుమారు రెండు వేల రాకెట్లతో దాడి చేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం సుమారు 220 ప్రాజెక్టైల్స్‌తో దాడి చేసినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. అయితే దాంట్లో 30 రాకెట్లు బోర్డర్ దాటలేకపోయినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది. డజన్ల సంఖ్యలో దూసుకువస్తున్న రాకెట్లను ఐరన్ డోమ్ మిస్సైల్ రక్షణ వ్యవస్థ అడ్డుకుంటోందని ఐడీఎఫ్ వెల్లడించింది. గురువారం రాత్రి జరిగిన దాడిలో ఒకరు మృతిచెందారు.

ఇక గాజా నగరంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ రక్షణ దళం పేర్కొన్నది. గాలిలోకి ఎగిరిన సుమారు 145 విమానాలు.. ఒకేసారి హమాస్ ఉగ్రవాద గ్రూపుకు చెందిన టన్నెళ్లపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గత అయిదు రోజుల్లో తాము చేసిన అతిపెద్ద దాడి ఇదే అని ఐడీఎఫ్ చెప్పింది. వైమానిక దళం నిర్వహించిన దాడి సుమారు 40 నిమిషాల పాటు సాగింది. నార్తర్న్ గాజాలో ఉన్న 150 టార్గెట్లపై 450 మిస్సైళ్లు కురిపించినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది. హమాస్ ఇంటలిజెన్స్ కేంద్రాలపై జరిగిన దాడిలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని ఇజ్రాయిల్ రక్షణ శాఖ చెప్పింది. హమాస్‌కు చెందిన అండర్ గ్రౌండ్ మౌళికసదుపాయాలను దెబ్బతీసినట్లు ఇజ్రాయిల్ వెల్లడించింది.
వైమానిక దళాలకు తోడుగా.. ఇజ్రాయిల్ ట్యాంకులు, ఆర్టిల్లరీ సామాగ్రి, సాయుధ బలగాలు.. గాజా బోర్డర్ వద్ద భీకర కాల్పులు జరిపారు. గాజా సరిహద్దు వద్ద తమ సైనిక దళాలు ఉన్నట్లు ఇజ్రాయిల్ పేర్కొన్నది. ఇజ్రాయిల్ గంటకు పైగా దాడి చేసిందని, ఆ దాడుల్లో అనేక మంది మరణించినట్లు పాలస్తీనా వెల్లడించింది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా మిస్సైల్ దాడి చేశామని ఐడీఎఫ్ ప్రతినిధి జిల్బర్‌మ్యాన్ తెలిపారు. సోమవారం నుంచి జరుగుతున్న హింసలో .. ఇజ్రాయిల్‌కు చెందిన 9 మంది మరణించారు. ఇక గాజాలో 119 మంది మరణించినట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రెండు నెలల్లో 9 మంది జలమండలి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మృతి..!
Vishwambara | మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సైలెంట్‌గా పనులు పూర్తి చేస్తున్న వశిష్ఠ!
Tharun Bhascker | చెత్తను పంచదార పూసి ఇస్తే ఆడియన్స్ నమ్మరు.. రొటీన్ సినిమాలపై తరుణ్ భాస్కర్ కామెంట్స్
Kedarnath Temple: కేదార్నాథ్ ఆలయం మూసివేత
Stock Market | భారీ లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1300 పాయింట్లకుపైగా జంప్..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

