ఇజ్రాయెల్ దాడిలో 10 మంది పాలస్తీనియన్లు మృతి
పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్లో ఉన్న జెనిన్పై ఇజ్రాయెల్ సైనికులు దాడిచేశారు. దీంతో 10 మంది మరణించగా, పలువురు
న్యూఢిల్లీ: పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్లో ఉన్న జెనిన్పై ఇజ్రాయెల్ సైనికులు దాడిచేశారు. దీంతో 10 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. మృతుల్లో 61 ఏండ్ల మహిళ కూడా ఉన్నారని వెల్లడించారు. గత రెండు దశాబ్దాల్లో పాలస్తీనాలో జరిగిన అత్యంత ఘోరమైన ఘటనగా దీనిని అభివర్ణించారు. ఓ ప్రభుత్వ దవాఖానపై ఇజ్రాయెల్ దళాలు టియర్ గ్యాస్ పేల్చాయని చెప్పారు. దీంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారని తెలిపారు.

ఈ ఘటనపై పాలస్తీనా ప్రధాని మహమ్మద్ ష్టయేహ్ స్పందించారు. తమ దేశంలోని పిల్లలు, యువత, మహిళలకు రక్షణ కల్పించాలని ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలను కోరారు. కాగా, దేశంలో భారీ దాడులకు ప్లాన్ చేస్తున్న తీవ్రవాదులను అరెస్టు చేయడానికి వెళ్లా తమ సైనికులు వెళ్లారని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- attacks
- Israel
- Israeli forces
- Jenin
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

