డోడోమా : ఆఫ్రికన్ దేశం టాంజానియాలో బుధవారం జరిగిన సాధారణ ఎన్నికలు తీవ్ర రక్తపాతానికి దారితీశాయి. అణచివేత, ఎన్నికల మోసంపై దేశ వ్యాప్తంగా పౌరుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఎన్నికల ఫలితాలను ఆపాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేస్తూ పౌరులు దేశమంతా నిరసనలతో హోరెత్తించారు.
దీంతో ప్రభుత్వం పౌరులపై అణచివేతకు దిగింది. పెద్దయెత్తున మిలిటరీని దించింది. పలుచోట్ల నిరసకారులపై కాల్పులు జరిగాయి. బాష్పవాయువును ప్రయోగించారు. ఇంటర్నెట్ను నిలిపివేశారు. ఇప్పటివరకు 10 మంది మరణించారని ఐరాస పేర్కొనగా, 700 మందికి పైగా మరణించారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.