కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న తాలిబన్లు అందులో భాగంగా బుధవారం దేశ మాజీ అధ్యక్షుడు హమిద్ కర్జాయ్ని కలిశారు. తాలిబన్ కమాండర్, హక్కానీ నెట్వర్క్ టెర్రరిస్ట్ గ్రూప్ లీడర్ అయిన అనస్ హక్కానీ.. కర్జాయ్తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో కర్జాయ్తోపాటు గత ప్రభుత్వంలో శాంతిదూతగా వ్యవహరించిన అబ్దుల్లా అబ్దుల్లా ఉన్నారు. అయితే ఈ ఇద్దరి మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చాయన్న విషయం మాత్రం తెలియలేదు. తాలిబన్లో హక్కానీ నెట్వర్క్ అనేది చాలా కీలకం. పాకిస్థాన్ సరిహద్దులో ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆఫ్ఘనిస్థాన్లో జరిగిన అనేక ఉగ్ర దాడుల వెనుక ఈ హక్కానీ నెట్వర్క్ హస్తం ఉంది.