Sunita Williams | మళ్లీ నిరాశే.. సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన భారత అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు (Sunita Williams) మరోసారి నిరాశే ఎదురయింది. తొమ్మిది నెలలుగా ఐఎస్ఎస్లో ఉంటున్న ఆమె భూమి మీదికి రావడం మరింత ఆలస్యమయ్యేలా ఉంది.
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో చిక్కుకుపోయిన భారత అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు (Sunita Williams) మరోసారి నిరాశే ఎదురయింది. తొమ్మిది నెలలుగా ఐఎస్ఎస్లో ఉంటున్న ఆమె భూమి మీదికి రావడం మరింత ఆలస్యమయ్యేలా ఉంది. ఐఎస్ఎస్ నుంచి సునీతతోపాటు బచ్ విల్మోర్ను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా-స్పేస్ ఎక్స్ సంయుక్తంగా చేపట్టిన క్రూ 10 మిషన్‌లో భాగంగా గురువారం జరగాల్సిన ప్రయోగం వాయిదాపడింది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ 10 మిషన్ సిద్ధమైంది. అయితే చివరి నిమిషంలో సాకేంతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య రావడంతో దీనిని ఆపేసినట్లు నాసా (NASA) వెల్లడించింది. శుక్ర లేదా శనివారాల్లో ఈ ప్రయోగాన్ని తిరిగి నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.
Standing down from tonight’s launch opportunity of @NASA‘s Crew-10 mission to the @Space_Station
— SpaceX (@SpaceX) March 12, 2025
కాగా, షెడ్యూల్ ప్రకారం ఈ ప్రయోగం మార్చి 25న జగాల్సి ఉంది. అయితే నాసా దానిని ముందుకు జరిపినా.. అది వాయిదాపడింది. క్రూ-10 ద్వారా కొత్త బృందం ఐఎస్ఎస్కు చేరుకోగానే.. స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ఎండీవర్ ద్వారా సునీత, విల్మోర్లు భూమిమీదకు తిరిగి రానున్నారు. టెస్ట్ మిషన్ కోసం బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో విలియమ్స్, విల్మోర్ 2024, జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. ఎనిమిది రోజుల తర్వాత వారు భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది. అయితే స్టార్‌లైనర్ స్పేస్ క్రాఫ్ట్.. ఐఎస్ఎస్ను చేరుకోగానే సమస్యలు తలెత్తాయి. అందులోని ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడంతోపాటు హీలియం కూడా అయిపోయింది.
ఈ నేపథ్యంలో వ్యోమగాములను ఈ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో వ్యోమగాములు లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024, సెప్టెంబర్ 7న క్షేమంగా భూమికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి సునీత, విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Astronauts
- Crew-10 mission
- ISS
- NASA
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

