అమెరికా స్టైల్స్ చాలు.. గడ్డం ట్రిమ్ చేశారో.. బార్బర్లకు తాలిబన్ల హెచ్చరిక

కాబూల్: ఇస్లాం మత సాంప్రదాయాల ప్రకారం పరిపాలించే తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్‌లో ఆ దిశగా ఒక్కో అడుగూ వేస్తున్నారు. తాజాగా అక్కడి హెల్మాండ్ ప్రావిన్స్‌లో క్షురకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. స్థానికులకు గడ్డాలు ట్రిమ్ చేయడం ఆపండి.. లేదంటే శిక్షలు తప్పవు అని హెచ్చరించారు. గడ్డం ట్రిమ్ చేయడం అనేది ఇస్లాం చట్టానికి విరుద్ధమని తాలిబన్లు స్పష్టం చేశారు. అటు కాబూల్‌లోనూ తాలిబన్ల నుంచి తమకు ఇలాంటి ఆదేశాలు అందినట్లు అక్కడి బార్బర్లు చెప్పారు. తాము మారిపోయామని, గతంలో కంటే భిన్నంగా పరిపాలిస్తామని ఓవైపు చెబుతూనే.. మరోవైపు ఇలాంటి కఠినమైన ఇస్లామిక్ చట్టాలను వాళ్లు అమలు చేస్తున్నారు.
హెల్మాండ్ ప్రావిన్స్‌లో ఇప్పటికే అందరు బార్బర్లకు తాలిబన్లు నోటీసులు పంపించారు. అండర్ కవర్లో ఉన్న తాలిబన్లను పంపించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే ప్రణాళికలు కూడా వాళ్లు వేస్తున్నారు. అమెరికా స్టైల్స్ ఇక చాలని తాలిబన్లు స్పష్టం చేస్తున్నారు. గత రెండు దశాబ్దాలుగా స్థానిక ఆఫ్ఘన్ యువత సెలూన్లకు వెళ్లి తమకు నచ్చిన స్టైల్స్‌లో హెయిర్‌కట్ చేయించుకోవడం అలవాటు చేసుకున్నారు. కానీ తాలిబన్లు మళ్లీ అధికారంలోకి రావడంతో అక్కడి యువతకు, బార్బర్లకు కష్టాలు మొదలయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

