AIDS | స్టెమ్ సెల్ చికిత్సతో ఎయిడ్స్ పూర్తిగా నయం
ఎయిడ్స్ మహమ్మారి చికిత్సలో మరో ముందడుగు పడింది. జర్మనీకి చెందిన 60 ఏండ్ల వ్యక్తికి ఈ వ్యాధి పూర్తిగా నయమైంది.
- జర్మనీ దేశస్థుడికి స్టెమ్ సెల్ చికిత్స విజయవంతం
- వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న ఏడో వ్యక్తి
AIDS | బెర్లిన్, జూలై 18: ఎయిడ్స్ మహమ్మారి చికిత్సలో మరో ముందడుగు పడింది. జర్మనీకి చెందిన 60 ఏండ్ల వ్యక్తికి ఈ వ్యాధి పూర్తిగా నయమైంది. 40 ఏండ్ల ఎయిడ్స్ చరిత్రలో పూర్తిగా ఈ వ్యాధి బారి నుంచి బయటపడ్డ ఏడో వ్యక్తి ఈయన. బాధితుడికి చేసిన స్టెమ్ సెల్ చికిత్స విజయవంతమైనట్టు వైద్యులు గురువారం ప్రకటించారు. ఇతడికి 2015లో ప్రమాదకరమైన, నొప్పితో కూడుకున్న స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్టు తెలిపారు.
హెచ్ఐవీతో పాటు మైలాయిడ్ లుకేమియా ఉన్న వారికి మాత్రమే ఈ చికిత్స చేస్తామన్నారు. ఈ చికిత్స తీసుకున్నప్పటి నుంచి ఇతడి శరీరంలో మళ్లీ వైరస్ జాడలు కనిపించలేదని వైద్యులు తెలిపారు. కాగా, ఎయిడ్స్ బారి నుంచి పూర్తిగా బయటపడ్డ మొదటి వ్యక్తి టిమోతి రే బ్రౌన్కు కూడా లుకేమియా సమస్య ఉండేది. దీంతో 2007లో ఆయనకు కూడా స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. ఆ తర్వాత అతడు ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న మొదటి వ్యక్తిగా నిలిచారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- AIDS
- German
- HIV
- stem cell therapy
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

