మిసెస్ శ్రీలంక పోటీలో వివాదం.. రన్నరప్‌కు విన్నర్ టైటిల్

కొలంబో: శ్రీలంకలో జరిగిన అందగత్తెల పోటీ వివాదానికి తెరలేపింది. మిసెస్ శ్రీలంక టైటిల్ గెలిచిన పుష్పికా డిసిల్వాకు అవమానం ఎదురైంది. అందగత్తెల పోటీల్లో స్టేజ్ మీదే ఆమె గాయపడింది. మిసెస్ శ్రీలంక ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగింది. టైటిల్ గెలిచిన పుష్పిక డిసిల్వాకు.. తొలుత ఆమె తలపై కిరీటాన్ని తొడిగారు. అయితే అదే స్టేజ్‌పై ఉన్న 2019 మిసెస్ శ్రీలంక విజేత కరోలైన్ జూరీ స్టేజ్‌పై అనుచితంగా వ్యవహరించింది.
2021 విన్నర్ పుష్పిక డిసిల్వా తలపై నుంచి కిరీటాన్ని తీసి రన్నరప్‌కు కరోలినా తొడిగింది. రన్నరప్‌కు బ్యూటీ కిరీటాన్ని తొడగడంతో.. స్టేజ్ మీదున్న విన్నర్ పుష్పిక అక్కడ నుంచి వెళ్లిపోయింది. అయితే మిసెస్ శ్రీలంక అవార్డును కేవలం పెళ్లి అయిన మహిళలకే ఇస్తారని, కానీ విడాకులు తీసుకున్నవారికి కాదు అని కరోలినా ఆ స్టేజ్ మీదే పేర్కొన్నది.
ఆ రూల్ ప్రకారం రన్నరప్‌కు బ్యూటీ కిరీటం దక్కుతుందని కరోలినా చెప్పింది. ఈ వివాదంపై విన్నర్ పుష్పిక తన సోషల్ మీడియా అకౌంట్లో స్పందించింది. తాను విడాకులు తీసుకోలేదని, ఒకవేళ విడాకులు తీసుకుంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని పుష్పిక డిమాండ్ చేసింది. వివాదాన్ని నిర్వాహకులు పరిష్కరించారు. అసలైన విన్నర్ పుష్పిక డిసిల్వానే అని తేల్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

