లంకలో Fuel Crisis.. వారంపాటు బడులు బంద్
Fuel Crisis | గత కొన్ని నెలలుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. నిత్యావసరాల ధరలు చుక్కలను తాకడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను చమురు కొరత (Fuel Crisis) వేధిస్తున్నది. రేషన్ విధానంలో పెట్రోల్, డీజిల్‌ను పంపిణీ చేస్తున్నప్పటికీ అది అవసరాలను తీర్చలేకపోతున్నది.
కొలంబో: గత కొన్ని నెలలుగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నది. నిత్యావసరాల ధరలు చుక్కలను తాకడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను చమురు కొరత (Fuel Crisis) వేధిస్తున్నది. రేషన్ విధానంలో పెట్రోల్, డీజిల్‌ను పంపిణీ చేస్తున్నప్పటికీ అది అవసరాలను తీర్చలేకపోతున్నది. దీంతో శ్రీలంక ప్రభుత్వం వారం రోజులపాటు బడులను మూసివేయాలని నిర్ణయించింది. రాజధాని కొలంబోతోపాటు దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వ, ప్రైవేటు బడులను నేటి నుంచి వారంపాటు తెరవద్దని అధికారులను ఆదేశించింది.
విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని స్కూళ్ల యాజమాన్యాలకు విద్యాశాఖ మంత్రి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించుకోవచ్చని, అయితే ట్రాన్స్పోర్టేషన్తో సంబంధం లేని విద్యార్థులనే బడులకు అనుమతించాలని చెప్పారు. విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు వినేందుకుగాను ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎలాంటి విద్యుత్ కోతలు ఉండకుండా చూడాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
చమురు సంక్షోభంతో జూన్ 18 నుంచి వారం రోజుల పాటు దేశంలో స్కూళ్లను ప్రభుత్వం బంద్ చేసింది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన (1948) తర్వాత శ్రీలంక ఇంతటి సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఇదే మొదటి సారి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

