శ్రీలంకలో సంక్షోభం.. రోజుకు 10 గంటలు కరెంట్ బంద్
కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ముదురుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రతి రోజు 10 గంటల పాటు విద్యుత్తు కోతను విధించనున్నట్లు ఇవాళ ప్రభుత్వం ప్రకటించింది. విదేశీ మారక నిలువలు అడుగంటిపోవడంతో.. ఆ దేశంలో తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో వేలాది మంది ఇంధనం కోసం క్యూలైన్లు కడుతున్నారు. దిగుమతి ఆంక్షలు ఉన్న నేపథ్యంలో అన్ని నిత్యావసరాల సరఫరాలోనూ కొరత ఏర్పడింది. ఇక పవర్ కట్స్‌ను రోజుకు 10 గంటలు చేస్తున్నట్లు ఇవాళ అధికారులు తెలిపారు.
ఈ నెల ఆరంభం నుంచి శ్రీలంకలో రోజుకు ఏడు గంటల పాటు విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. థర్మల్ పవర్‌ను జనరేట్ చేసేందుకు కావాల్సిన ఇంధనం లేదని, అందుకే 750 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉన్నట్లు అధికారులు చెప్పారు. ప్రభుత్వం త్వరలో ఆరు వేల మెట్రిక్ టన్నుల డీజిల్‌ను ఎల్ఐఓసీ వద్ద కొనుగోలు చేయనున్నట్లు ఇంధనశాఖ మంత్రి గామిని లోకుజే తెలిపారు. విదేశీ మారకం లేకపోవడంతో.. శ్రీలంక ప్రస్తుతం మందులు కొనలేని పరిస్థితిలో ఉంది. అయితే శ్రీలంకకు తక్షణ సాయం చేయనున్నట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
Harish Rao | హరీష్‌రావుకు గద్వాల బీఆర్ఎస్ నాయకుల ఘనస్వాగతం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

