గురువారం 01 అక్టోబర్ 2020
International - Sep 09, 2020 , 17:24:24

స‌ముద్రం నుంచి కొట్టుకొచ్చిన వేల జీవులు.. ద‌గ్గ‌ర నుంచి చూస్తే గుండె ఝ‌ల్లుమంటుంది!

స‌ముద్రం నుంచి కొట్టుకొచ్చిన వేల జీవులు.. ద‌గ్గ‌ర నుంచి చూస్తే గుండె ఝ‌ల్లుమంటుంది!

సోష‌ల్ మీడియాలో ప్ర‌తిరోజూ వింత జంతువులు, వ‌న్య‌ప్రాణుల‌ను చూస్తేనే ఉంటాం. కానీ మ‌న‌కు తెలియ‌ని జీవులు ఇంకా ఉన్నాయి. అవి ఒక‌టి రెండూ చూస్తే ఏం కాదు. ఒక్క‌సారిగా వేలాది జీవుల‌ను చూసేస‌రికి నెటిజ‌న్ల‌కు గుండె ఘ‌ల్లుమన్న‌ది. దీనికి సంబంధించిన వీడియోల‌ను ఫేస్‌బుక్‌లో షేర్ చేయ‌గా అవి కాస్త వైర‌ల్ అయ్యాయి. ఇలాంటి జీవుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదంటున్నారు నెటిజ‌న్లు. మ‌రి ఆ జీవులు ఎలా ఉన్నాయో వీడియోలో చూడాల్సిందే.

ఇటీవ‌ల నార్త్ వేల్స్‌లో వేలాది గూసెనెక్ బార్నాకిల్స్ ఒడ్డుకు కొట్టుకువ‌చ్చాయి. ఈ జీవుల గురించి చాలా త‌క్కువ విని ఉంటారు. ఈ పోస్ట్‌ను మార్టిన్ గ్రీన్ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. మార్టిన్ అత‌ని కుటుంబంతో క‌లిసి కెర్నార్‌ఫోన్ ఒడ్డున న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా ఈ జీవులు క‌నిపించాయి. బాగా ప‌రిశీలిస్తే అక్క‌డ వేలాది జీవులు ఉన్నాయ‌ని గ్ర‌హించారు. ఆ త‌ర్వాత వాటిని గూసెనెక్ బార్నాకిల్ అని పిలుస్తారు, అవి చాలా అరుదైన‌వి అని తెలుసుకున్నారు. ఇవి పోర్చుగ‌ల్‌, స్పెయిన్ వంటి ప్రాంతాల్లో చాలా ఖ‌రీదైన‌వి.


logo