శనివారం 06 జూన్ 2020
International - Apr 18, 2020 , 18:06:38

స్పెయిన్‌లో 20వేలు దాటిన కరోనా మృతులు

స్పెయిన్‌లో 20వేలు దాటిన కరోనా మృతులు

మాడ్రిడ్‌: స్పెయిన్‌లో కరోనావైరస్‌ మృతుల సంఖ్య 20వేలు దాటింది. గత 24 గంటల్లో 565 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 20,043కు చేరింది. కరోనాతో యూరప్‌లో ఎక్కువగా ప్రభావితమైన స్పెయిన్‌లో కొత్తగా 887 మంది కరోనా పాజిటివ్‌లుగా తేలింది.  దీంతో ఇప్పటివరకు 1,91,726 కేసులు నమోదుకాగా, మొత్తం 20043 మంది మరణించారు. 

ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రాణాంతక వైరస్‌ బారిన పడినవారి సంఖ్య 22,67,830కి చేరింది. ఇందులో 1,55,185 మంది మరణించారు.


logo