California Earthquake: కాలిఫోర్నియాలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రత నమోదు
California Earthquake: కాలిఫోర్నియాలో 5.2 తీవ్రతతో భూకంపం నమోదు అయ్యింది. ప్రస్తుతం ప్రాణ, ఆస్తి నష్టాలకు చెందిన సమాచారం లేదు. కెర్న్ కౌంటీలోని మెట్లర్ కేంద్రంగా భూ కంపం సంభవించింది.
లాస్ ఏంజిల్స్ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భూకంపం(California Earthquake) వచ్చింది. మంగళవారం రాత్రి లాస్ ఏంజిల్స్‌కు వాయవ్య దిశలో భూకంపం సంభవించింది. ఎటువంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అమెరికా జియోలాజికల్ సర్వే దీనిపై ప్రకటన చేసింది. రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రతతో భూమి కంపించినట్లు చెప్పింది. రాత్రి 9 గంటల 9 నిమిషాలకు భూమి కంపించింది. కెర్న్ కౌంటీలోని మెట్లర్ వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు చెప్పారు.
లాస్ ఏంజిల్స్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ఏమైనా నష్టం జరిగిందా లేదా అన్న కోణంలో చెక్ చేస్తున్నారు. లాస్ ఏంజిల్స్ డాజర్స్, ఫిలడెల్ఫియా ఫిల్లీస్ జట్ల మధ్య బేస్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలో భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. కానీ ప్రేక్షకులు మాత్రం చలించలేదు. భూకంప ప్రాంతంలో తనిఖీ చేపట్టనున్నట్లు కెర్న్ కౌంటీ ఫైర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

