Xi Jinping | గృహ నిర్బంధంలో జీ జిన్‌పింగ్.. చైనాలో సైనిక తిరుగుబాటు?!
Xi Jinping | చైనాలో సైనిక తిరుగుబాటు జరిగిందని, అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో పెట్టారని వార్తలొస్తున్నాయి.
Xi Jinping | కమ్యూనిస్టు పార్టీ పాలనలో ఉన్న చైనాలో ప్రభుత్వంపై సైనిక తిరుగుబాటు చేస్తునట్లు తెలుస్తున్నది. శాశ్వత అధ్యక్షుడిగా నియమితులైన జీ జిన్‌పింగ్‌ను సైన్యం గృహ నిర్బంధంలో పెట్టినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వార్తాకథనాలు ప్రచురించాయి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక సంపత్తి గల చైనా.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఇప్పుడు దేశ రాజధాని బీజింగ్ వైపు కదులుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దాదాపు 50 వేల మంది సైనిక జవాన్లు బీజింగ్ దిశగా కదులుతున్నాయి. హెబెయిలోని ఝాంజియాకౌ నగరాన్ని దాటి బీజింగ్‌కు శివారుల్లోకి సైన్యం చేరుకుందని సమాచారం.
దేశ రాజధాని మార్గంలో 80 కిలో మీటర్ల పొడవునా సైనిక వాహనాలే కనిపిస్తున్నాయని పలువురు చైనీయులు ట్విట్టర్ వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. పీఎల్ఏ మొత్తం అధికార యంత్రాంగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నదని, చైనా అధ్యక్షుడిగా లీ కియామింగ్‌ను నియమించిందని వార్తలొస్తున్నాయి.
చైనా అధ్యక్షుడిగా జీ జిన్‌పింగ్‌ను అధికార కమ్యూనిస్టు పార్టీ జీవిత కాల అధ్యక్షుడిగా నియమించింది. అలా శాశ్వత అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత జిన్‌పింగ్ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని కొద్ది రోజులుగా విమర్శలు వస్తున్నాయి. పైకి నవ్వుతూ ఉండే జిన్‌పింగ్ ఆలోచనలు క్రూరంగా ఉంటాయని విమర్శకులు చెబుతుంటారు. ఆయన నియంతృత్వ పోకడలు పెరిగిపోవడంతో చైనా కమ్యూనిస్టు పార్టీలోనే తిరుగుబాటు వచ్చినట్లు సమాచారం. జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా పార్టీ తీర్మానం చేసిందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జిన్‌పింగ్‌ను సైన్యం గృహ నిర్బంధంలో ఉంచిందని వినికిడి.
ఈ నెల 16న జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సదస్సులో పాల్గొని రాగానే బీజింగ్‌లోనే జిన్‌పింగ్‌ను సైన్యం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తున్నది. బీజింగ్ వైపు వేల సంఖ్యలో సైన్యం కదులుతుండటంతో చైనాలో అంతర్గత సంక్షోభం తలెత్తిందని చెబుతున్నారు. చైనా పాలనను మిలటరీ తన చేతుల్లోకి తీసుకున్నట్లు కూడా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. చైనా సైన్యం చీఫ్‌గా జిన్‌పింగ్‌ను తొలగించారన్న వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. ఈ అంశాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ గానీ, అధికార మీడియా గానీ ధృవీకరించడం లేదు.
#PLA military vehicles heading to #Beijing on Sep 22. Starting from Huanlai County near Beijing & ending in Zhangjiakou City, Hebei Province, entire procession as long as 80 KM. Meanwhile, rumor has it that #XiJinping was under arrest after #CCP seniors removed him as head of PLA pic.twitter.com/hODcknQMhE
— Inconvenient Truths — Jennifer Zeng Reports (@jenniferzeng97) September 23, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

