వాషింగ్టన్, అక్టోబర్ 3: మిఠాయి డబ్బా అంతటి సైజు కూడా లేని ఓ అధునాతన ఉపగ్రహం గత కొన్ని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలకు మిస్టరీగా ఉన్న గ్రహాంతరవాసులను అన్వేషించడానికి బయల్దేరింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గత వారం చేపట్టిన ఈ మిషన్ విజయవంతంగా కొనసాగుతున్నది. సౌరకుటుంబం బయటనున్న గ్రహాల్లోని పరిస్థితులు, అక్కడి జీవం ఉనికిని కనిపెట్టేందుకు కొలరాడో ఆల్ట్రావయొలెట్ ట్రాన్సిట్ ఎక్స్పరమెంట్ (క్యూ ట్) ఉపగ్రహం సవ్యదిశలో పయనిస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇదే మిషన్‌లో ప్రయోగించిన భూపరిశీలన ఉపగ్రహం ల్యాండ్‌శాట్-9, క్యూపిడ్ శాటిలైట్లు కూడా చక్కగా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు.