Sikh Taxi Driver | భారత ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీ : కారులో దొరికిన రూ.4.5 లక్షలను తిరిగిచ్చేశాడు
ఆస్ట్రేలియాలో ఓ సిక్కు ట్యాక్సీ డ్రైవర్ (Sikh Taxi Driver) నిజాయితీపై పలువురు ప్రశంసలు గుప్పించారు. తన ట్యాక్సీ వెనుక సీటులో ఓ ప్రయాణీకుడు వదిలివేసిన 8000 ఆస్ట్రేలియన్ డాలర్లను (రూ. 4.53 లక్షలు) డ్రైవర్ చరణ్‌జిత్ సింగ్ అత్వాల్ తిరిగి ఇచ్చేశాడు.
మెల్బోర్న్ : ఆస్ట్రేలియాలో ఓ సిక్కు ట్యాక్సీ డ్రైవర్ (Sikh Taxi Driver) నిజాయితీపై పలువురు ప్రశంసలు గుప్పించారు. తన ట్యాక్సీ వెనుక సీటులో ఓ ప్రయాణీకుడు వదిలివేసిన 8000 ఆస్ట్రేలియన్ డాలర్లను (రూ. 4.53 లక్షలు) డ్రైవర్ చరణ్‌జిత్ సింగ్ అత్వాల్ తిరిగి ఇచ్చేశాడు. తన కారులో ప్రయాణీకులు ఏమైనా విలువైన వస్తువులను వదిలివేశారా అని తాను తరచూ తనిఖీ చేస్తుంటానని 9 న్యూస్ మెల్బోర్న్తో మాట్లాడుతూ అత్వాల్ చెప్పుకొచ్చారు.
తాను ఇటీవల తన కారు బ్యాక్ సీటులో 8000 డాలర్లను చూశానని వెంటనే డబ్బును పోలీసులకు అందచేశానని తెలిపారు. ఆ డబ్బును తన వద్ద దాచుకోవాలనే ఆలోచన తన మనసులో ఎన్నడూ మెదలేదని అన్నారు. డబ్బును తిరిగి అందచేయడంతో యజమాని నుంచి రివార్డ్ ఏమైనా లభించిందా అని ప్రశ్నించగా తనకు రివార్డ్ అవసరం లేదని అత్వాల్ చెప్పుకొచ్చారు.
అత్వాల్ మూడున్నర దశాబ్ధాలుగా మెల్బోర్న్లో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. అత్వాల్ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు అతడి నిజాయితీ, కృతజ్ఞతా భావం పట్ల ప్రశంసలు గుప్పించారు. ఇతరులు కూడా మంచిపనులు చేయాలని ఇలాంటి సానుకూల స్టోరీలు స్ఫూర్తి నింపుతాయని ఓ యూజర్ కామెంట్ చేయగా, అతడి మంచితనం, నిజాయితీ అతడికి పది రెట్ల మంచి చేస్తుందని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :
Kajal Aggarwal | బార్బీ డాళ్‌గా మారిపోయిన కాజల్ అగర్వాల్.. ట్రెండింగ్‌లో స్టిల్స్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

