వర్జీనియా: అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో కాల్పుల ఘటన జరిగింది. చీసేపీక్లో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో జరిగిన కాల్పుల్లో ఓ సాయుధుడు పది మందిని చంపినట్లు తెలుస్తోంది. వాల్‌మార్ట్‌లో స్టోర్ మేనేజర్‌గా ఉన్న వ్యక్తే.. తన వద్ద ఉన్న గన్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ వ్యక్తి తనను తాను కాల్చుకున్నాడు.
చీసేపీక్ నగర పోలీసులు తమ ట్వీట్లో షూటర్ చనిపోయినట్లు పేర్కొన్నారు. కాల్పుల్లో సుమారు పది మంది మృతిచెంది ఉంటారని, అనేక మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఏ కారణం చేత షూటర్ దాడి చేశాడో స్పష్టంగా తెలియదు.