Citibank Shooting: అమెరికా సిటీబ్యాంక్ క్యాంపస్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి.. వీడియో
Citibank Shooting: ఫ్లోరిడా రాష్ట్రంలోని సిటీబ్యాంక్ ఆఫీసు క్యాంపస్‌లో కాల్పులు ఘటన జరిగింది. ఓ ఆగంతకుడు తన కారుతో క్యాంపస్‌లోకి దూసుకువచ్చి గన్‌తో ఫైరింగ్ చేశాడు. ఆ కాల్పుల్లో ఓ మహిళ మృతిచెందగా, ఆ షూటర్‌ను సెక్యూర్టీ గార్డు కాల్చాడు.
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న సిటీబ్యాంక్ ఆఫీసు క్యాంపస్‌లో కాల్పులు(Citibank Shooting) ఘటన జరిగింది. ఓ ఆగంతకుడు తన కారుతో క్యాంపస్‌లోకి దూసుకువచ్చాడు. టంపా సమీపంలో ఉన్న బ్రాండన్ సిటీబ్యాంక్ స ఎంటర్లో ఈ ఘటన జరిగింది. లంచ్ సమయంలో దూసుకువచ్చిన అతను కారులో నుంచి ఏఆర్ స్టయిల్ భారీ రైఫిల్‌ను తీసి కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో ఓ మహిళా ఉద్యోగి మృతిచెందింది. ఇక ఆ సాయుధుడిని అక్కడ పనిచేస్తున్న సెక్యూర్టీ గార్డు కాల్చేశాడు. మహిళతో పాటు షూటర్ మృతిచెందగా, మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.
ఈ ఘటన తర్వాత వందల సంఖ్యలో పోలీసులు సిటీబ్యాంక్ సెంటర్‌కు చేరుకున్నారు. కాల్పులు జరిగిన సమయంలో బ్యాంకులో సుమారు 3200 మంది పనిచేస్తున్నట్లు తెలిసింది. సెక్యూర్టీ ఫెన్సింగ్‌ను కారుతో ఢీకొట్టి.. ఔట్‌డోర్ డైనింగ్ ప్రాంతానికి దుండగుడు దూసుకువచ్చాడు. ఉద్యోగులు లంచ్ చేస్తున్న ప్రాంతంలో బీభత్సం సృష్టించాడు. గన్‌తో డైనింగ్ ఏరియాలో తిరుగుతున్న సాయుధుడి వీడియో వైరల్ అవుతోంది.
అయితే బిల్డింగ్ కేఫటేరియాలోకి ప్రవేశించిన షూటర్‌ను సిటీబ్యాంక్ సెక్యూర్టీ గార్డు కాల్చాడు. ఇద్దరి మధ్య గన్‌ఫైర్ జరిగింది. గార్డు కాల్పులకు షూటర్ కిందపడిపోయాడు. అతన్ని టంపా ఆస్పత్రికి తరలించారు. కానీ అతను మృతిచెందినట్లు డాక్టర్లు తేల్చారు.
#BREAKING UPDATE – Active shooter armed with rifle seen exiting rammed vehicle at CitiBank Center in Tampa, Florida. Suspect is deceased. https://t.co/0NQXKkczJ9
— Fast News Network (@fastnewsnet) November 4, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Citibank Shooting: అమెరికా సిటీబ్యాంక్ క్యాంపస్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి.. వీడియో
Ramayana | ‘రామాయణ’ ట్విట్టర్ రివ్యూ.. రణ్‌బీర్ నటనకు ప్రశంసలు, రావణుడిగా యష్ విశ్వరూపం!
Jailer 2 | తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్ల మార్క్ దాటిన ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లోనే సరికొత్త రికార్డు దిశగా రజనీకాంత్!
Nithya Raman: కేరళలో పుట్టింది.. లాస్ ఏంజిల్స్ మేయర్ కాబోతోంది.. ఎవరీ నిత్యారామన్?
Kaaka | డిసెంబర్లో అమెరికాకు మెగాస్టార్ చిరంజీవి.. ‘కాకా’ పాట విడుదల సందర్భంగా యూఎస్ టూర్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

