Nithya Raman: కేరళలో పుట్టింది.. లాస్ ఏంజిల్స్ మేయర్ కాబోతోంది.. ఎవరీ నిత్యారామన్?
Nithya Raman: లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో నిత్యా రామన్ ముందున్నారు. తోటి డెమోక్రటిక్ నేత కేరన్ బాస్‌పై ఆమె గెలుపు ముంగిట నిలిచారు. దాదాపు 52 శాతం ఓట్లు ఆమెకు పోలయ్యాయి. దీంతో లాస్ ఏంజిల్స్ నగరానికి తొలి ఏషియన్-అమెరికన్ మేయర్‌గా నిత్యా రామన్ రికార్డు క్రియేట్ చేయనున్నారు.
లాస్ ఏంజిల్స్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అనేకమంది భారత సంతతి వ్యక్తులు విజయం సాదించారు. కేరళలో పుట్టిన నిత్యా రామన్(Nithya Raman) .. లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో ముందున్నారు. కేరన్ బాస్‌పై ఆమె గెలుపు ముంగిట నిలిచారు. దాదాపు 52 శాతం ఓట్లు ఆమెకు పోలయ్యాయి. దీంతో లాస్ ఏంజిల్స్ నగరానికి తొలి ఏషియన్-అమెరికన్ మేయర్‌గా నిత్యా రామన్ రికార్డు క్రియేట్ చేశారు. తాజా సమాచారం ప్రకారం నిత్యా రామన్‌కు 51.1 శాతం ఓట్లు పోలయ్యాయి. బాస్‌కు 48.33 శాతం ఓట్లు పడినట్లు తెలుస్తోంది.
తోటి డెమోక్రటిక్ నేత అయిన కేరన్ బాస్‌తో పోటీపడేందుకు చివరి నిమిషంలో నిత్యా రామన్ నిర్ణయించారు. ఆమె ఆకస్మిక ఎంట్రీతో అనేక మంది నేతలు షాకయ్యారు. అప్పటి వరకు బాస్‌కు సపోర్టు ఇచ్చిన ఆమె.. అనూహ్య రీతిలో మేయర్ రేసుకు పోటీపడ్డారు. బాస్ మేయర్‌గా ఉన్న సమయంలో లాస్ ఏంజిల్స్‌లో వైల్డ్ఫైర్లు, హాలీవుడ్లో ఉద్యోగాల కోత లాంటి సమస్యలు ఎదురయ్యాయి. అయితే నగరంలో గుంతల్ని పూడ్చడం, వీధి దీపాలను వెలిగేలా చేస్తానని ఆమె వాగ్దానాలు చేశారు. రామన్ తన ఎన్నికల ప్రచారంలో.. మున్సిపల్ సౌకర్యాలను కల్పించనున్నట్లు ప్రామిస్ చేశారు. అయితే నిత్యా రామన్‌కు కెన్నెత్ మేజా సపోర్టు ఇవ్వడంతో ఆమె పోరు ఆసక్తికరంగా మారింది. రామన్, మేజా.. ఇద్దరూ కలిసి ప్రచారం నిర్వహించారు. ట్రంప్ పాలన ముగిసే సమయంలో లాస్ ఏంజిల్స్ మేయర్‌గా రామన్ చేయనున్నారు. 2028 ఒలింపిక్స్ నిర్వహణ బాధ్యతలు కూడా నిత్యా రామన్ చేతికి చిక్కనున్నాయి.
నిత్యా రామన్ 1981లో కేరళలో పుట్టారు. ఆరేళ్ల వయసులో ఆమె అమెరికాకు వలస వెళ్లారు. 22 ఏళ్ల వయసులో ఆమె అమెరికా పౌరురాలిగా మారారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ చేశారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి అర్బన్ ప్లానింగ్‌లో ఆమె మాస్టర్స్ డిగ్రీ చేశారు. ట్రాన్స్పరెంట్ చెన్నై అనే అర్బన్ రీసర్చ్ గ్రూపును ఆమె స్థాపించారు.2013లో నిత్యా రామన్ లాస్ ఏంజిల్స్‌కు మారారు. సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కోసం ఆమె పనిచేశారు. టైమ్స్ అప్ ఎంటర్టైన్మెంట్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆమె చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithya Raman: కేరళలో పుట్టింది.. లాస్ ఏంజిల్స్ మేయర్ కాబోతోంది.. ఎవరీ నిత్యారామన్?
Kaaka | డిసెంబర్లో అమెరికాకు మెగాస్టార్ చిరంజీవి.. ‘కాకా’ పాట విడుదల సందర్భంగా యూఎస్ టూర్!
RC 17 | రామ్ చరణ్‌తో సుకుమార్ మరో ప్రయోగం.. రంగస్థలం తర్వాత ఊహించని సబ్జెక్ట్‌తో మెగా పవర్ స్టార్!
Manipur: మణిపూర్‌లో వర్గపోరు.. ముగ్గురు నాగా మిలిటెంట్లు హతం
Khammam | ఖమ్మంలో తీవ్ర విషాదం.. మత్స్యకారుల ప్రాణాలు కాపాడి వరదలో కొట్టుకుపోయిన 11 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది !
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

