షార్క్‌కు చిక్కిన మహిళ… 35 సెకన్లు షార్క్‌ను విపరీతంగా బాది… బాది.. తప్పించుకుంది
ఓ మహిళ ఈత కొట్టడానికి అని సముద్రంలోకి వెళ్లింది. వెళ్లడమే ఆలస్యం.. షార్క్ చేప పట్టేసింది. ఈమె కాలును షార్క్ చేప పట్టేసింది. కానీ ఆ మహిళ అత్యంత చాకచక్యంతో షార్క్ నుంచి తప్పించుకుంది. అమెరికా ఫ్లోరిడాలో ఈ ఘటన జరిగింది. హీదర్ వెస్ట్ (42) సముద్రంలోకి వెళ్లింది. సముద్రంలోకి వెళ్లడమే తరువాయి… ఆమె కాలును లెమన్ షార్క్ గట్టిగా పట్టేసింది. ఆమె కాలును షార్క్ పట్టేసింది. తప్పించుకోవడానికి ఆమె చాలా ప్రయత్నాలు చేసింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. షార్క్ నుంచి తప్పించుకోడానికి చేతులు, కాళ్లను గిలగిలా ఆడించడం ప్రారంభించారనని, షార్క్ తలపై విపరీతమైన ధైర్యంతో, బలంతో కొట్టడం ప్రారంభించినట్లు ఆమె తెలిపారు. తలపై కొట్టగా.. .కొట్టగా… చివరకు షార్క్ నుంచి బయటపడ్డానని ఆమె వెల్లడించారు.
నీటిలోకి వెళ్లినప్పుడు బాగానే ఉంది. కొద్ది సేపటి తర్వాతే అలజడి ప్రారంభమైంది. దీంతో ఏదో ఇబ్బంది వచ్చిందని నాకు అర్థమైపోయింది. ఒక్కసారిగా నా ఎడమ కాలు విపరీతమైన నొప్పి పుట్టడం ప్రారంభమైంది. షార్క్ చేప పట్టిందని అనుమానం వచ్చింది. వెనక్కి చూసే సరికి అదే నిజమైంది. వెంటనే తేరుకున్నాను. ధైర్యంతో తలపై బాదడం ప్రారంభించా. చేతితో ఆగకుండా కొట్టడం చేశా. ఎంత వీలైతే అంత బలంగా కొట్టడం ప్రారంభించా. దాదాపు 35 సెకన్ల తర్వాత షార్క్ చేప నన్ను వదిలేసింది. అని హీదర్ వెస్ట్ వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- florida
- Heather West
- Shark
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

