Myanmar Finance : మయన్మార్‌లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం
Myanmar Finance : మయన్మార్ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నది. డబ్బు దొరక్క ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద నగదు విత్‌డ్రా చేసేందుకు జనం పడిగాపులు పడుతున్నారు. ఇదే అదనుగా కమిషన్ ఏజెంట్లు ప్రజల నుంచి పెద్ద మొత్తంలో కమిషన్ తీసుకుని నగదు ఇస్తున్నారు.

నయపిటవ్ : మయన్మార్ తీవ్ర ఆర్థిక సంక్షోభం (Myanmar Finance) ఎదుర్కొంటున్నది. డబ్బు దొరక్క ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద నగదు విత్‌డ్రా చేసేందుకు జనం పడిగాపులు పడుతున్నారు. ఇదే అదనుగా కమిషన్ ఏజెంట్లు ప్రజల నుంచి పెద్ద మొత్తంలో కమిషన్ తీసుకుని నగదు ఇస్తున్నారు. ఆరు నెలల క్రితం సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్న అనంతరం ఈ పరిస్థితులు దాపురించాయి. సైన్యానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. సైనిక ప్రభుత్వం ఆన్లైన్ చెల్లింపులపై నిషేధం కారణంగా సంక్షోభం పెరిగింది. మరోవైపు ఇంటర్నెట్ షట్ డౌన్ కారణంగా కూడా నగదు లభించడం లేదు.
తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి మయన్మార్ సాక్షీభూతంగా నిలిచింది. నగదు కొరత ఏర్పడింది. నగదు విత్‌డ్రా చేయడానికి తెల్లవారుజామున 3 గంటల నుంచే ఏటీఎంల వద్ద జనం క్యూ కడుతున్నారు. మధ్యాహ్నం వేళలో బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బు తీసుకోవడానికి వేచి ఉంటున్నారు. బ్యాంకుల్లో ప్రజల రద్దీని తగ్గించడానికి ఏటీఎంలలో కరెన్సీ నోట్లను నింపుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. ఒక వ్యక్తి రూ.9 వేలకు మించి విత్‌డ్రా చేయకుండా నిబంధనలు పెట్టారు.
ఆర్థిక సంక్షోభం ప్రభావాలు ప్రతిచోటా కనిపిస్తున్నాయి. షాపింగ్ తగ్గిపోతున్నది. కార్మికులకు జీతాలు చెల్లించానికి సంస్థలు ఇబ్బంది పడుతున్నాయి. మయన్మార్ కరెన్సీ క్యాట్ విలువ డాలర్‌తో పోలిస్తే 20 శాతం పడిపోయింది. దేశంలో 100 కంటే తక్కువ ఏటీఎంలలో నగదు లభిస్తున్నది. కరెన్సీ నిల్వల కోసం చాలా మంది వ్యాపారులు డిజిటల్ చెల్లింపులకు బదులుగా నగదు తీసుకుంటున్నారు. నగదు కోసం ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. కరెన్సీ బ్రోకర్లు మాత్రం రెచ్చిపోతున్నారు. కమీషన్‌పై ఆన్లైన్ చెల్లింపునకు బదులుగా 7 నుంచి 15 శాతం కమీషన్ తీసుకుని నగదును ఇస్తున్నారు. దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైనిక తిరుగుబాటు తర్వాత జరిగిన హింసలో ఇప్పటివరకు 945 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది సైన్యం కాల్పుల్లో మరణించారు.
ఇవి కూడా చదవండి..
కాకోరి రైలు దోపిడీకి 96 ఏండ్లు
రెండో సెషన్ ఐపీఎల్ కోసం కొత్త నిబంధన.. అదేంటంటే..?
తడిసి మోపెడవుతున్న డిజిటల్ ఖర్చు..
రక్తంలో షుగర్ నియంత్రణకు కృత్రిమ క్లోమం
మిస్ కాల్‌తో గ్యాస్ కనెక్షన్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

