Afghanistan | కాబూల్‌లో తాలిబన్ల కాల్పులు.. పలువురు మృతి
Afghanistan | ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. పంజ్‌షేర్ మినహా దేశం మొత్తాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్న తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు.

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. పంజ్‌షేర్ మినహా దేశం మొత్తాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్న తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాగా, పంజ్‌షేర్ కూడా తమ వశమైందని తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆనందోత్సాహాలతో తాలిబన్లు నిన్న రాత్రికాబూల్‌లోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున గాలిలోకి కాల్పులు జరిపారు. దీంతో చిన్నారులు సహా పలువురు మృతిచెందారని, భారీ సంఖ్యలో గాయపడ్డారని అస్వాకా న్యూస్ ఏజెన్సీ పేర్కొన్నది. గాయపడినవారిని స్థానికులు హుటాహుటిన దవాఖానకు తరలించారని తెలిపింది.
కాగా, పంజ్‌షేర్ లోయను కూడా ఆక్రమించామన్న తాలిబన్ల ప్రకటనను నార్తర్న్ అలయెన్స్ బలగాలు ఖండించాయి. పంజ్‌షేర్‌పై దాడికి దిగిన తాలిబన్ దళాలపై నార్తర్న్ అలయెన్స్ బలగాలు ఎదురుదాడికి దిగాయి, ముష్కరమూకలపై తూటాల వర్షం కురిపించాయి. దాంతో తాలిబన్లు తోకముడుచుకుని వెనుదిరగక తప్పలేదు. ఈ పోరులో తాలిబన్లకు భారీ ప్రాణనష్టం జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- afghanistan
- Firing
- Kabul
- panjshir
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

