బీజింగ్, అక్టోబర్ 23: ప్లాస్టిక్ కప్పుల్లో కాఫీ తాగుతున్నారా? వాటిల్లో కాఫీ లేదా టీ పార్సిల్ తీసుకెళ్తున్నారా? అయితే, మీకు ఓ చేదువార్త.. వారంలో ఒకసారి ప్లాస్టిక్ కప్పులో కాఫీ లేదా టీ పార్సిల్ తీసుకెళ్లి తాగినా ఏడాది కాలంలో మీ శరీరంలోకి 90 వేల మైక్రో ప్లాస్టిక్ కణాలు చేరిపోతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఐదు నిమిషాలపాటు కప్పులో వేడి ద్రవాలను ఉంచి పార్సిల్ తీసుకెళ్లినప్పుడు కుదుపుల వల్ల వాటి గోడల నుంచి 1,500 ప్లాస్టిక్ కణాలు విడుదలవుతాయని చైనాలోని సిచువాన్ వర్సిటీ పరిశోధకులు గుర్తించారు.
పాలిప్రొఫైలిన్, పాలిథిలీన్ టెరెఫ్తాలేట్, పాలిథిలిన్ కప్పుల్లో ఈ చర్యలు జరుగుతున్నట్టు కనుగొన్నారు. ఈ మైక్రోప్లాస్టిక్ కణాలు ఆరోగ్యానికి అత్యంత ప్రమాదమని, ఇవి మానవ కణాల్లోకి చొచ్చుకుపోయే ప్రమాదం ఉన్నదని పరిశోధకులు పేర్కొన్నారు.