కృత్రిమ గుడ్డుతో కోడిపిల్లల సృష్టి
డాలస్‌కు చెందిన డీఎక్స్టింక్షన్ సంస్థ కొలోసల్ బయోసైన్సెస్ కృత్రిమ గుడ్డు వ్యవస్థ ద్వారా 26 ఆరోగ్యవంతమైన కోడిపిల్లలను పొదిగించడంలో విజయం సాధించింది.
- 26 పిల్లలను పొదిగించిన డాలస్ సంస్థ
టెక్సాస్: డాలస్‌కు చెందిన డీఎక్స్టింక్షన్ సంస్థ కొలోసల్ బయోసైన్సెస్ కృత్రిమ గుడ్డు వ్యవస్థ ద్వారా 26 ఆరోగ్యవంతమైన కోడిపిల్లలను పొదిగించడంలో విజయం సాధించింది. దీని సిలికాన్ ఆధారిత పొర అసలు గుడ్డు పెంకులాగే పనిచేస్తుంది. ఇది ఆక్సిజన్‌ను లోపలికి రానిస్తూ, తేమను నిలిపి ఉంచుతుంది, బాక్టీరియాను అడ్డుకుంటుంది. డోడో, జెయింట్ మోవా వంటి అంతరించిన పక్షులను తిరిగి తీసుకురావాలనే వారి లక్ష్యం దిశగా ఇది చాలా పెద్ద విజయంగా భావించవచ్చు.
పిండానికి హాని కలిగించే లేదా అదనపు ఆక్సిజన్ అవసరమయ్యే పాత పద్ధతులతో పోలిస్తే ఈ డిజైన్ కోడిపిల్లలు పెరగడానికి సురక్షితమైన, సహజ వాతావరణాన్ని అందిస్తుంది. ఇందులో ఒక పారదర్శక కిటికీ ఉన్నది. దీని ద్వారా శాస్త్రవేత్తలు పిండాలకు ఎలాంటి అంతరాయం కలిగించకుండా వాటి ఎదుగుదలను గమనించవచ్చు. ఈ వ్యవస్థ చాలా అనుకూలమైనది. దీన్ని పెద్ద గుడ్ల కోసం పరిమాణం పెంచవచ్చు లేదా చిన్న గుడ్ల కోసం తగ్గించవచ్చు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

