Viral News | తిమింగలం పొట్టలో 3 కోట్ల నిధి
Viral News | స్పెయిన్‌లోని లా పాల్మాలోని నొగాలస్ బీచ్‌లోకి కొట్టుకు వచ్చిన స్పెర్మ్ జాతి తిమింగలం కళేబరంలో సైంటిస్టులు నిధిని కనుగొన్నారు. నిధి అంటే బంగారం, వెండి కాదు.. సముద్రంలో తేలే బంగారంగా పిలిచే తిమింగలం వాంతి అది.
Viral News | స్పెయిన్, జూలై 5: స్పెయిన్‌లోని లా పాల్మాలోని నొగాలస్ బీచ్‌లోకి కొట్టుకు వచ్చిన స్పెర్మ్ జాతి తిమింగలం కళేబరంలో సైంటిస్టులు నిధిని కనుగొన్నారు. నిధి అంటే బంగారం, వెండి కాదు.. సముద్రంలో తేలే బంగారంగా పిలిచే తిమింగలం వాంతి అది. లాస్ పాల్మస్ యూనివర్శిటీ, జంతు పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో తిమింగలం మృతికి గల కారణాలు తెలుసుకోవడానికి అటాప్సీ నిర్వహించగా, తిమింగలం పొట్టలో వారికి అరుదైన నిధి లభించింది. సుమారు 9.5 కేజీల బరువున్న అంబెర్గ్రిస్ను పొట్ట నుంచి వెలికి తీశారు. దాని విలువ సుమారు మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు.
ఏమిటీ తిమింగలం వాంతి?
తిమింగలం వాంతిగా పేర్కొనే అంబెర్‌గ్రిస్ తిమింగలాల పొట్టలో మాత్రమే తయారవుతుంది. ఆ తిమింగలాలు స్కిడ్ (ఒక రకం ఎర, చేపల)ను మింగుతాయి. అవి పొట్టలోకి వెళ్లాక అంబ్రెయిన్ అనే రసాయనం విడుదలవుతుంది. దాని కారణంగా అది ముక్కలై ముద్దగా మారుతుంది. వాటిని అరాయించుకోలేని తిమింగలాలు వాంతి రూపంలో బయటకు కక్కుతాయి. ముద్దలా ఉండే దానిని అంబెర్‌గ్రిస్ అంటారు. సువాసనలు వెదజల్లే దీని ధర కేజీ 30.50 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ పదార్ధాన్ని సుగంధ ద్రవ్యాల తయారీలో వినియోగిస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

