Cancer Cells | అమైనోసియానైన్ అణువులతో క్యాన్సర్ కణాలు 99% అంతం
అమైనోసియానైన్ అణువులను ఉపయోగించి క్యాన్సర్ కణాలను తొలగించే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అణువులను సాధారణంగా బయో ఇమేజింగ్‌లో సింథటిక్ రంగులుగా వాడతారు.
- కొత్త పద్ధతిని అభివృద్ధి చేసిన పరిశోధకులు
Cancer Cells | టెక్సాస్, డిసెంబర్ 28: అమైనోసియానైన్ అణువులను ఉపయోగించి క్యాన్సర్ కణాలను తొలగించే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అణువులను సాధారణంగా బయో ఇమేజింగ్‌లో సింథటిక్ రంగులుగా వాడతారు. సైన్స్అలర్ట్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం ఈ అణువులను పరారుణ కాంతికి దగ్గరగా ఉద్దీపనం చేసినప్పుడు క్యాన్సర్ కణాలను విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని పొందుతాయి.
రైస్ యూనివర్సిటీ కెమిస్ట్ జేమ్స్ టూర్ ప్రకారం మాలిక్యూలర్ జాకమర్స్గా పిలిచే ఈ అణువులు ఫెరింగా టైప్ మోటార్స్ అణువులతో పోలిస్తే పది లక్షల రెట్లు వేగంగా యాంత్రిక చలనంలో పనిచేస్తాయి. వీటిని పరారుణ కాంతికి దగ్గరగా ఉపయోగించడం వల్ల శరీరం లోపలికి వ్యాప్తి చెందుతాయి. ఎముకలు, అవయవాల క్యాన్సర్ చికిత్సలో శస్త్ర చికిత్సల అవసరాన్ని ఈ కొత్త పద్ధతి తగ్గిస్తుంది. ఈ కొత్త పద్ధతిని ఎలుకలపై ప్రయోగించినప్పుడు విజయవంతమైంది. అమైనోసియానిన్ అణువులు కదిలినప్పుడు అందులోని ఎలక్ట్రాన్లు ప్లాస్మాన్లను ఏర్పరుస్తాయి. ఈ ప్లాస్మాన్లు ప్రకంపనల ద్వారా క్యాన్సర్ కణాలను అంతం చేస్తాయి. అయితే ఈ ప్రయోగాలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

