Sam Altman | ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి..!
Sam Altman | ఓపెన్ఏఐ సీఈవో (OpenAI CEO) శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) ఇంటిపై దాడి జరిగింది. శాన్ఫ్రాన్సిస్కోలోని ఆల్ట్‌మన్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తి మొలటోవ్ కాక్టెయిల్ (Petrol Bomb) విసిరాడు. దాంతో ఇంటి గేటుకు మంటలు అంటుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 4:12 గంటల సమయంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి శామ్ ఇంటిపై మండే పరికరాన్ని విసిరి పారిపోయాడు.
Sam Altman : ఓపెన్ఏఐ సీఈవో (OpenAI CEO) శామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) ఇంటిపై దాడి జరిగింది. శాన్ఫ్రాన్సిస్కోలోని ఆల్ట్‌మన్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తి మొలటోవ్ కాక్టెయిల్ (Petrol Bomb) విసిరాడు. దాంతో ఇంటి గేటుకు మంటలు అంటుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున 4:12 గంటల సమయంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి శామ్ ఇంటిపై మండే పరికరాన్ని విసిరి పారిపోయాడు. సమాచారం అందిన వెంటనే తమ బృందం ఘటనా స్థలికి చేరుకుందని పోలీసులు తెలిపారు.
దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసుల ధ్రువీకరించారు. అయితే ఘటన సమయంలో శామ్ ఇంట్లోనే ఉన్నారా లేదా.. అనే దానిపై స్పష్టత లేదు. ఈ దాడి వెనుకగల ఉద్దేశం ఏంటో కూడా తెలియరాలేదు. దీని తర్వాత ఓపెన్ ఏఐ ప్రధాన కార్యాలయానికి నిప్పు పెడతామని బెదిరింపులు కూడా వచ్చాయన్నారు. ఈ ఘటనకు సంబంధించి 20 ఏళ్ల యువకుడిని అనుమానితుడిగా భావించి అరెస్టు చేసినట్లు తెలిపారు. శామ్ ఇంటిపై దాడి, ప్రధాన కార్యాలయానికి వచ్చిన బెదిరింపులను సంస్థ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. దర్యాప్తులో పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

