Vladimir Putin: మే 19న చైనా వెళ్లనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. చైనాలో పర్యటించనున్నారు. మే 19, 20వ తేదీల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఆయన భేటీ కానున్నారు.
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin).. చైనాలో పర్యటించనున్నారు. మే 19, 20వ తేదీల్లో ఆయన పర్యటన కొనసాగుతుంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఆయన భేటీ కానున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టూర్ చేసిన కొన్ని రోజుల తేడాలోనే రష్యా అధ్యక్షుడు చైనా ట్రిప్‌కు వెళ్తున్నారు. పుతిన్, జిన్‌పింగ్ ఇద్దరూ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై స్పందించనున్నారు. సంయుక్త డిక్లరేషన్‌పై ఇద్దరు నేతలు సంతకం చేయనున్నారు. ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో ఇద్దరు నేతల భేటీ కీలకం కానున్నది. రష్యా అధ్యక్షుడికి చైనా ఆహ్వానం పంపినట్లు క్రెమ్లిన్ తన ప్రకటనలో తెలిపింది. పుతిన్ తన పర్యటనలో చైనా ప్రధాని లీ క్వియాంగ్ను కూడా కలుసుకుంటారు. వాణిజ్యం, ఆర్థిక సంబంధాలపై చర్చించుకోనున్నారు. గత ఆగస్టులోనే పుతిన్ చైనాలో విజిట్ చేశారు. బీజింగ్‌లో షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ జరిగినప్పుడు పుతిన్ వెళ్లారు. ఈ ఏడాది పుతిన్ రెండు సార్లు చైనాలో పర్యటించనున్నారు. నవంబర్‌లో షెన్జెన్లో జరిగే ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ మీటింగ్‌కు హాజరుకానున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

