మాస్కో: ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని వ్యతిరేకించిన జర్నలిస్టుకు (Russian Journalist) రష్యన్ కోర్టు జైలు శిక్ష విధించింది. మిఖాయిల్ ఫెల్డ్‌మాన్ అనే జర్నలిస్టు ఉక్రెయిన్‌పై దాడిని ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో రష్యన్ సాయుధ బలగాలను అప్రతిష్టపాలు చేశారని కాలినిన్గ్రాడ్లోని వెస్ట్రన్ ఎక్స్క్లేవ్లోని కోర్టు పేర్కొంది. ఫెల్డ్మాన్కు రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇదేవిధంగా ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు వ్యతిరేకంగా వార్తలు రాసిన మరో ఐదుగురు రిపోర్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రెండేండ్ల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో క్రెమ్లిన్ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని అక్కడి ప్రభుత్వం శిక్షిస్తూ వస్తున్నది. గతేదడాది ఏప్రిల్‌లో వ్లాదిమిర్ కారా-ముర్జా జూనియర్ అనే జర్నలిస్టు, రాజకీయ కార్యకర్తను దేశద్రోహం నేరంకింద కోర్టు 25 ఏండ్ల జైలు శిక్ష విధించింది. సైనిక చర్యను బహిరంగంగా విమర్శిస్తున్న ఆయనపై అప్పటికే రెండుసార్లు విషప్రయోగం జరిగింది.