రష్యా దళాలు ఉక్రెయిన్‌పై కచ్చితంగా దాడులు చేస్తాయని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ పునరుద్ఘాటించారు. కొన్ని రోజుల్లోనే రష్యా దళాలు దాడులు చేసే అవకాశముందని మరోమారు ప్రకటించారు. కొన్ని రోజుల్లోనే అతి పెద్ద ముప్పు పొంచి వుందని, ఈ విషయం సమసిపోలేదని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు జోబైడెన్ గురువారం వైట్‌హౌజ్‌లో విలేకరులతో మాట్లాడారు.
ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి తమ దళాలను ఉపసంహరించుకున్నామని రష్యా ప్రకటించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అయితే ఈ విషయంపై ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో సంభాషణలు చేయమని తేల్చి చెప్పారు. ‘అతి పెద్ద ముప్పే పొంచి వుంది… దళాలను రష్యా ఉపసంహరించుకోలేదు. పైగా.. మరిన్ని దళాలను మోహరించింది. ఉక్రెయిన్‌లోకి ప్రవేశించి.. దాడులకు దిగే అవకాశాలున్నాయని మాకు సమాచారం ఉంది’ అని బైడెన్ పేర్కొన్నారు.