Russia Warns Finland & Sweedon | ఒకవైపు ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యా.. తాజాగా స్వీడన్, ఫిన్లాండ్లకు హెచ్చరికలు జారీ చేసింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటా)లో సభ్యులుగా చేరితే స్వీడన్, ఫిన్లాండ్ చేరితే, హానికర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి డిమిట్రీ పెస్కోవ్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌లోకి రష్యా సైన్యాలు ప్రవేశించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలు జారీ చేసిన తర్వాత పెస్కోవ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకున్నది. నాటోలో స్వీడన్, ఫిన్లాండ్ చేరితే వాటిపైనా యుద్ధానికి దిగాల్సి వస్తుందని ఇంతకుముందే రష్యా హెచ్చరించింది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో రష్యా సైన్యాలు అడుగు పెట్టిన తర్వాత.. శాంతి చర్చల కోసం కీవ్‌కు ప్రతినిధి బృందాన్ని పంపేందుకు సిద్ధం అని పుతిన్ చెప్పినట్లు అధికార వార్తా సంస్థ తెలిపింది. ఉక్రెయిన్‌పై దూకుడుగా వెళుతున్న రష్యాపై నాటో కూటమి దేశాలు మరోసారి సమావేశమై ఆంక్షలు పునరుద్ఘాటించాయి.
చైనా కూడా శాంతి చర్చలతోనే ఉక్రెయిన్-రష్యా సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే, చైనా పొరుగున ఉన్న తైవాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా మాదిరిగానే చైనా కూడా తమపై దాడి చేస్తుందేమోనని తైవానీయులు భయపడుతున్నారు. అమెరికాతో అంటకాగుతున్న తైవాన్ అంటే చైనా భగ్గుమంటున్నది.