మాస్కో: పశ్చిమ దేశాలకు రష్యా వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ తమ ఇంధన సరఫరాపై నిషేధం విధిస్తే, అప్పుడు యూరోప్‌కు గ్యాస్ సరఫరాను నిలిపేస్తామని రష్యా పేర్కొన్నది. డిప్యూటీ ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ దీని గురించి సోమవారం ఓ ప్రకటన చేశారు. రష్యా ఆయిల్‌పై ఆంక్షలు విధిస్తే అది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందన్నారు. ఆంక్షల వల్ల బ్యారెల్ ఇంధన ధర 300 డాలర్లకు చేరుతుందని ఆయన హెచ్చరించారు.
ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాపై అమెరికా ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే కూటమి దేశాలతో కలిసి రష్యా ఇంధనం వాడకంపై బ్యాన్ విధించేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. యూరోప్‌లో వివిధ దేశాలకు 40 శాతం గ్యాస్, 30 శాతం ఇంధనం రష్యా నుంచే అందుతుంది. ఒకవేళ ఆ సరఫరా ఆగిపోతే అప్పుడు ఆ దేశాల పరిస్థితి అయోమయంగా ఉంటుంది. ఫస్ట్ నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ ద్వారా జర్మనీకి రష్యా నుంచి గ్యాస్ సరఫరా అవుతోంది.