North Korea | అమెరికా జోక్యం.. ఏకపక్ష ధోరణి వల్లే ఉక్రెయిన్ సంక్షోభం..!
North Korea | అమెరికా సైనిక ఆధిపత్యం, ఏకపక్ష ధోరణి వల్లే ఉక్రెయిన్ సంక్షోభం తలెత్తిందని నార్త్ కొరియా ఆరోపించింది.
North Korea | అమెరికా అధిక జోక్యం, ఏకపక్ష ధోరణి వల్లే ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేసిందని ఉత్తర కొరియా ఆరోపించింది. తన దేశ భద్రత కోసం చట్టబద్ధంగా రష్యా చేస్తున్న డిమాండ్‌ను పట్టించుకోకుండా అమెరికా సైనిక ఆధిపత్యానికి ప్రయత్నించిందని పేర్కొంది. ఉత్తరకొరియా విదేశాంగశాఖ వెబ్సైట్లో ఓ పోస్ట్ పెట్టింది. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులకు అమెరికా వైఖరే కారణం అని వ్యాఖ్యానించింది.
శాంతి, స్థిరత్వం పేరుతో ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటున్నదని ధ్వజమెత్తింది. వివిధ దేశాలు తమ జాతీయ భద్రతకు చేపట్టే స్వీయ రక్షణ చర్యలను అమెరికా ఖండిస్తున్నదని వ్యాఖ్యానించిది. సుప్రీం లీడర్‌గా వ్యవహరించాలన్న అమెరికా ఆలోచనలకు కాలం చెల్లిందని స్పష్టం చేసింది. గురువారం నుంచి ఉక్రెయిన్‌పై రష్యా సైన్యాలు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. రష్యా చర్యను అమెరికా, బ్రిటన్, జర్మనీ తదితర దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ఉత్తర కొరియా ఆదివారం మరో బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. ఈ సంగతిని దక్షిణ కొరియా, జపాన్ ధృవీకరించాయి. ఉక్రెయిన్ సంక్షోభాన్ని నివారించడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తుండగా, ఉత్తరకొరియా క్షిపణిని పరీక్షించడం గమనార్హం. అంతర్జాతీయ ఆంక్షలు అమలులో ఉన్నా గత నెలలో ఉత్తరకొరియా ఏడు క్షిపణులను పరీక్షించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

