బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై రాకెట్ దాడి
అమెరికా ఎంబసీ| ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై రాకెట్ దాడి జరిగింది. పటిష్ట భద్రత నడుమ గ్రీన్జోన్లో ఉన్న ఎంబసీపైకి గురువారం ఉదయం ఓ రాకెట్ దూసుకొచ్చింది. అయితే దానిని గుర్తించిన యాంటీ రాకెట్ సిస్టం.. ఆ రాకెట్‌ను దారి మళ్లించింది.

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీపై రాకెట్ దాడి జరిగింది. పటిష్ట భద్రత నడుమ గ్రీన్జోన్లో ఉన్న ఎంబసీపైకి గురువారం ఉదయం ఓ రాకెట్ దూసుకొచ్చింది. అయితే దానిని గుర్తించిన యాంటీ రాకెట్ సిస్టం.. ఆ రాకెట్‌ను దారి మళ్లించింది. కాగా, కొద్దిసేపట్లోనే మరో రాకెట్ ఎంబసీకి సమీపంలో పడిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ దాడులవల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని భద్రతాధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భవనాలు, ఇతర దేశాలకు సంబంధించిన ఎంబసీలు కూడా ఉన్నాయి.

ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో రెండు రోజుల క్రితం అమెరికా ఎంబసీపై ఎగిరిన డ్రోన్‌ను ఆ దేశ భద్రతా దళాలు కూల్చివేశాయి. గత సోమవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఎగిరిన ఈ డ్రోన్ లో శక్తిమంతమైన పేలుడు పదార్థాలు ఉన్నట్టు తెలిసింది. అమెరికా సైనికులు రాకెట్లను ప్రయోగించి దీన్ని కూల్చివేశారని ఎంబసీ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి బాగ్దాద్ లోని అమెరికన్ స్థావరాలపై 47 డ్రోన్ దాడులు జరిగాయని ఏఎఫ్ పీ వార్తా సంస్థ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
యూరో కప్: ఫైనల్లో ఇటలీతో తలపడనున్న ఇంగ్లండ్
కేంద్రం మంత్రిగా కిషన్‌రెడ్డి నేడు బాధ్యతల స్వీకరణ
హిమాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం వీరభద్రసింగ్ కన్నుమూత
మోదీ క్యాబినెట్ విస్తరణ.. వచ్చే సార్వత్రిక ఎన్నికలే టార్గెట్?!
దిలీప్ కుమార్ కన్నుమూత.. ఒక శకం ముగిసిందంటూ సెలబ్స్ ట్వీట్స్
ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల కొవిడ్ మరణాలు : డబ్ల్యూహెచ్‌వో
చౌటుప్పల్‌లో ముగ్గురు పిల్లలకు ఉరివేసి తల్లి బలవన్మరణం
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Bagdad
- Embassy
- Iraq
- rocket attack
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

