లండన్ : యూఎస్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్‌లో సీనియర్ సలహాదారుడిగా చేరినట్లు బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ గురువారం లింక్డ్ఇన్లో వెల్లడించారు. ఈ రెండు కంపెనీల సలహాదారుడిగా తనకు వచ్చే ఆదాయాన్ని తన భార్య అక్షతా మూర్తితో కలిసి ప్రారంభించిన రిచ్మండ్ ప్రాజెక్ట్‌కు విరాళంగా ఇస్తానని చెప్పారు.
బిజినెస్ అపాయింట్‌మెంట్స్‌పై పనిచేసే సలహా కమిటీ సూచన మేరకు మాజీ మంత్రులు, సీనియర్ సివిల్ సర్వెంట్లను తమ ఉద్యోగులుగా నియమించుకుంటామని అమెజాన్, గూగుల్ నిధులు అందిస్తున్న ఆంత్రోపిక్ తెలిపింది.