Lotto Jackpot | రిటైర్డ్ మెకానిక్ పంట పండింది.. రూ.328 కోట్ల లాటరీ
Lotto Jackpot | అమెరికాలో ఓ రిటైర్డ్ మెకానిక్ (Retired Iowa Mechanic) పంట పండింది. ఎలాంటి శ్రమ లేకుండానే ఏకంగా వందల కోట్ల రూపాయలు ఆయన సొంతమయ్యాయి.
Lotto Jackpot | అమెరికాలో ఓ రిటైర్డ్ మెకానిక్ (Retired Iowa Mechanic) పంట పండింది. ఎలాంటి శ్రమ లేకుండానే ఏకంగా వందల కోట్ల రూపాయలు ఆయన సొంతమయ్యాయి.
61 ఏండ్ల ఎర్ల్ లాపే (Lapey Earl) అనే వ్యక్తి అయోవా రాష్ట్రంలోని డబ్యూక్ నగరంలో నివాసం ఉంటున్నాడు. అతను ఓ రిటైర్డ్ మెకానిక్. ఏప్రిల్ ఫూల్స్ డే (ఏప్రిల్ ఒకటో తేదీ) నాడు లొట్టో అమెరికా (Lotto America) అనే లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అదృష్టవశాత్తు ఆ లాటరీలో ఎర్ల్లాపేకి 40 మిలియన్ డాలర్లు బహుమతిగా లభించాయి. క్లైవ్లోని అయోవా లాటరీ కేంద్ర కార్యాలయంలో బహుమతిని స్వీకరించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ‘లాటరీ గెలుచుకోవడం ఓ కలలా అనిపించింది. విషయం తెలిసిన వెంటనే ఇదో జోక్ అనుకున్నాను. ఏప్రిల్ ఫూల్ అవుతానేమోనని’ అంటూ గట్టిగా నవ్వేశాడు.
కాగా, తనకు బహుమతిగా వచ్చిన మొత్తాన్ని ఒకేసారి తీసుకున్నారు ఎర్ల్ లాపే. దీంతో అతడికి 21.28 మిలియన్ డాలర్లు మాత్రమే లభించాయి. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.174 కోట్లు అన్నమాట. అలా కాకుండా ఏడాదికి కొంత మొత్తం చొప్పున తీసుకుంటే 29 సంవత్సరాల్లో 40 (రూ.328 కోట్లు) మిలియన్ డాలర్లూ లభించేవి. తనకు లభించిన ఈ డబ్బును కుటుంబ అవసరాలకు ఖర్చు చేయడంతోపాటు, ఆరోగ్య సమస్యలతో బాధపడే చిన్నారులను ఆదుకునేందుకు ఖర్చు చేస్తానని ఈ సందర్భంగా లాపే తెలిపారు.
Also Read..
Sonu Sood | 2500 కేజీల బియ్యంతో సోనూసూద్ చిత్రం.. వీడియో వైరల్..!
Viral News | ఎలుకను చంపిన కేసు.. నిందితుడిపై 30 పేజీల చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

