Samantha | అందం, అభినయం, తన నటనతో టాలీవుడ్లో అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత (Samantha). ప్రస్తుతం సామ్ టైటిల్ రోల్‌ని పోషిస్తున్న చిత్రం ‘శాకుంతలం’ (Shaakunatalam). గుణశేఖర్ దర్శకుడు. మహాకవి కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం సామ్ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలోనే ‘శాంకుతలం’ సినిమా గురించి 5 క్రేజీ (5 crazy Things) థింగ్స్‌ను ఇన్స్టావేదికగా వీడియో రూపంలో అభిమానులతో పంచుకుంది.
1. పూలంటే సమంతకు అలర్జీ అంట. అయితే ఈ సినిమా కోసం చేతికి, మెడకి పూల ఆభరణాలు ధరించాల్సి వచ్చిందట. వాటిని ఎక్కువసేపు అలాగే ఉంచుకోవడంతో చేతులపై దద్దుర్లు వచ్చినట్లు చెప్పింది. అవి టాటూలాగా కనిపించాయని, ఆరు నెలల పాటు అలానే ఉండిపోయినట్లు తెలిపింది. అయితే షూటింగ్ సమయంలో అవి కనిపించకుండా మేకప్‌తో కవర్ చేసినట్లు సామ్ చెప్పుకొచ్చింది.
2. ఇక శాకుంతలంలో తన పాత్రకు సమంత మూడు భాషల్లో డబ్బింగ్ చెప్పుకుందంట. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు తెలిపింది. ఇతర నటీనటులు పలు భాషల్లో ఎలా డబ్బింగ్ చెప్తారో తనకు తెలియదని చెప్పింది. ఇది చాలా కష్టంగా అనిపించిదని.. నిద్రలో కూడా డైలాగ్స్ కలలోకి వచ్చేవని తెలిపింది.
3. అంతేకాకుండా సినిమా షూటింగ్ సమయంలో సమంతను ఓ కుందేలు కరిచిందట. సెట్లో చాలా కుందేళ్లు ఉండేవని వాటిల్లో ఒకటి తనని కరిచిందని సమంత చెప్పింది. దీంతో ఆ కుందేలు తనకు అసలు నచ్చలేదని.. అది క్యూట్‌గానే లేదని సామ్ పేర్కొంది.
4. ఈ సినిమా కోసం నీతా లుల్లా (కాస్ట్యూమ్ డిజైనర్) చాలా అందమైన దుస్తులు తయారు చేసిందని సమంత తెలిపింది. ఓ పాటలో సామ్ ధరించిన లెహెంగా బరువు 30 కేజీలు ఉందని చెప్పింది. దాంతో చాలా ఇబ్బందిపడిందట. చుట్టూ తిరిగినప్పుడు ఆ లెహెంగా బరువుకు సామ్ ఫ్రేమ్ నుంచి పక్కకు వెళ్లడంతో.. కెమెరా మ్యాన్ గట్టిగా అరిచేవాడంట. నేను వెళ్లడం లేదు.. లెహెంగానే నన్ను లాక్కెళ్తోంది అని చెప్పడంతో సెట్లో అంతా నవ్వుకునేవారని సామ్ చెప్పుకొచ్చింది. దీంతో ఆ సీన్లో కనీసం 10 నుంచి 15 టేక్‌లు చేయాల్సి వచ్చిందని సామ్ వివరించింది.
5. ఇక ఈ సినిమాలో తన జుట్టుకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది సామ్. ‘శాకుంతలం’లో కనిపించే జుట్టు తన ఒరిజినల్ జుట్టు కాదని.. శకుంతల పాత్ర కోసం విగ్ ధరించినట్టు సామ్ తెలిపింది.
సమంత పంచుకున్న 5 క్రేజీ థింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ విషయాలు తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు సామ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘నువ్వు రియల్ క్వీన్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాలో శకుంతల పాత్రను సమంత పోషించగా.. దుష్యంత మహారాజు పాత్రలో దేవ్ మోహన్ (Dev Mohan) నటిస్తున్నారు.
ఈ మూవీలో అనన్య నాగళ్ల, అదితీ మోహన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.
Also Read..
India Corona | వార్నింగ్ బెల్స్.. ఒక్కరోజులో 7 వేలకు పైనే కొత్త కేసులు
Hyderabad | ఏటీఎం దొంగతనానికి ట్రై.. 5 నిమిషాల్లోనే దొంగలను పట్టేసుకున్న రాచకొండ పోలీసులు
Gutha Sukender reddy | సీఎం కేసీఆర్‌ను అభాసుపాలు చేయడానికి బీజేపీ కుట్ర: మండలి చైర్మన్ గుత్తా