ప్రతి హెచ్-1బీ వీసాదారుడిని తొలగిస్తా!
తాను కనుక ఎన్నికల్లో విజయం సాధిస్తే ఫ్లోరిడాలో పనిచేస్తున్న ప్రతి హెచ్-1బీ వీసాదారుడిని ఉద్యోగం నుంచి తొలగిస్తానని 2026లో జరిగే గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జేమ్స్ ఫిష్‌బాక్ ఓటర్లకు హామీనిచ్చారు.
- ఫ్లోరిడా గవర్నర్ పదవికి పోటీచేస్తున్న రిపబ్లికన్ అభ్యర్థి జేమ్స్ ఫిష్‌బాక్ ప్రచారం
ఫ్లోరిడా, నవంబర్ 30: తాను కనుక ఎన్నికల్లో విజయం సాధిస్తే ఫ్లోరిడాలో పనిచేస్తున్న ప్రతి హెచ్-1బీ వీసాదారుడిని ఉద్యోగం నుంచి తొలగిస్తానని 2026లో జరిగే గవర్నర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జేమ్స్ ఫిష్‌బాక్ ఓటర్లకు హామీనిచ్చారు. మాజీ డోజ్ ఆర్కిటెక్ట్, హెడ్జ్ ఫండ్ వ్యవస్థాపకుడు అయిన జేమ్స్ హెచ్-1బీ వీసాల ద్వారా అమెరికన్లకు జరుగుతున్న అన్యాయాన్ని తన ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రతిభావంతులైన అమెరికన్లను కాదని కొన్ని అమెరికన్ కంపెనీలు భారతీయులు, చైనీయులను నియమించుకుంటూ హెచ్-1బీ స్కామ్‌కు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.
తాను కనుక గవర్నర్‌గా విజయం సాధిస్తే అర్హులైన ఫ్లోరిడావాసులకు బదులుగా ఇతర దేశస్థులను నియమించుకుంటున్న కంపెనీల కాంట్రాక్టులన్నీ రద్దు చేస్తానని హామీనిచ్చారు. ట్రంప్ మద్దతు ఇచ్చిన రిపబ్లికన్ అభ్యర్థి ప్రతినిధి బైరాన్ డొనాల్డ్స్‌ను లక్ష్యంగా చేసుకుని కూడా జేమ్స్ విమర్శలు గుప్పించారు. ఆయన కార్పొరేట్ల ప్రయోజనాల కోసం అమెరికన్ కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తున్నారని ఆరోపించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదం భారతీయుల వల్లో, చైనీయుల వల్లో సాకారం కాదని, కేవలం అమెరికన్ల వల్లే అది సాధ్యపడుతుందని అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

