లండన్ : బన్హమ్స్ సంస్థ మంగళవారం లండన్‌లో నిర్వహించిన వేలంలో గాంధీ అరుదైన ఆయిల్ పెయింటింగ్‌కు ఊహించిన దాని కంటే మూడింతల ధర లభించింది. ఏకంగా రూ.1.76 కోట్లకు ఇది అమ్ముడుపోయింది. చిత్రకారిణి క్లేర్ లిగ్హ్టన్ దీనిని గీశారు. 1931లో గాంధీజీ రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి లండన్‌కు వెళ్లినప్పుడు గాంధీజీకి ఆమె పరిచయమయ్యారు.
‘ఒక ఆయిల్ పెయింటింగ్ కోసం గాంధీ కూర్చోవడం బహుశా ఇదొక్కటే కావొచ్చు. ఇది చాలా ప్రత్యేకమైన పెయింటింగ్’ అని బన్హమ్స్ సంస్థ అమ్మకాల అధిపతి డెమెరి తెలిపారు.