కంటిలో విత్తనం మొలిచెనే!
ఓ వ్యక్తి కంటిలో విత్తనం మొలిచింది! తీవ్రమైన తలనొప్పి, కంటి వాపుతోపాటు డబుల్ విజన్‌తో బాధపడుతున్న సైబీరియా వ్యక్తిలో దీనిని గుర్తించారు. 42 ఏండ్ల మాక్సిమ్ స్లెప్త్సోవ్కు వైద్యులు మత్తుమందు ఇచ్చి, చిన్న సూదితో ఆ విత్తనాన్ని తొలగించారు. అనంతరం ఆయనకు తలనొప్పి మటుమాయమైంది. అసలు ఆ విత్తనం అతని కంటిలోకి ఎలా చేరిందని ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. వేసవిలో స్నేహితులతో కలిసి చేపలు పట్టేందుకు, అడవి పండ్లు సేకరించేందుకు మాక్సిమ్ మారుమూల ప్రాంతానికి వెళ్లారు.
- సైబీరియాలో అరుదైన ఘటన
- కణజాలంలోకి చొచ్చుకెళ్లిన వేరు
- శస్త్రచికిత్స చేసి తొలగింపు
మాస్కో, అక్టోబర్ 29: ఓ వ్యక్తి కంటిలో విత్తనం మొలిచింది! తీవ్రమైన తలనొప్పి, కంటి వాపుతోపాటు డబుల్ విజన్‌తో బాధపడుతున్న సైబీరియా వ్యక్తిలో దీనిని గుర్తించారు. 42 ఏండ్ల మాక్సిమ్ స్లెప్త్సోవ్కు వైద్యులు మత్తుమందు ఇచ్చి, చిన్న సూదితో ఆ విత్తనాన్ని తొలగించారు. అనంతరం ఆయనకు తలనొప్పి మటుమాయమైంది. అసలు ఆ విత్తనం అతని కంటిలోకి ఎలా చేరిందని ఆరా తీస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. వేసవిలో స్నేహితులతో కలిసి చేపలు పట్టేందుకు, అడవి పండ్లు సేకరించేందుకు మాక్సిమ్ మారుమూల ప్రాంతానికి వెళ్లారు.
ఆ సమయంలో ఒక చెట్టుకొమ్మ అతని ముఖానికి తగిలి కంటిని గాయపరిచింది. దీంతో కన్ను ఎర్రబడి, నొప్పి, నీరు కారడం వంటి లక్షణాలు కన్పించాయి. కంటిని నీటితో శుభ్రం చేసుకుని లోపల ఉన్న చిన్న బెరడు ముక్కను తొలగించడంతో సమస్య పరిష్కారమైందని భావించారు. అయితే ఆయనకు తెలియకుండా ఒక చిన్న విత్తనం ఆయన కంటిలోనే ఉండిపోయింది. అది మొలకెత్తడం ప్రారంభించడంతో అతనికి తలనొప్పి పెరగడంతో పాటు చూపు కూడా మందగించింది. స్థానికంగా వైద్య సహాయం అందకపోవడంతో వందల కిలోమీటర్ల దూరంలోని యాకుట్స్ నగరానికి చేరుకుని నేత్ర వైద్య కేంద్రంలో పరీక్ష చేయించుకున్నాడు.
వేరు మూడు మిల్లీ మీటర్లు
వైద్య పరీక్షల్లో ఆయన కంటిలో విత్తనం మొలకెత్తినట్టు గుర్తించారు. కంటి తెల్లభాగాన్ని కప్పి ఉంచే పొరలోకి విత్తనం నుంచి వచ్చిన చిన్న వేరు చొచ్చుకెళ్లినట్టు తెలుసుకున్నారు. నేత్ర వైద్య నిపుణురాలు ఎలిజవేటా కార్పోవా మత్తుమందు ఇచ్చి, ఇంజెక్షన్ సూదిని ఉపయోగించి ఆ విత్తనాన్ని తొలగించారు. దాని వేరు సుమారు మూడు మిల్లీమీటర్లు పొడవు ఉన్నట్టు చెప్పారు. తన వైద్య వృత్తిలో ఇలాంటి ఘటనను చూడటం ఇదే తొలిసారని ఆమె తెలిపారు. వైద్య కేంద్ర ప్రధాన వైద్యుడు ఇవాన్ లుట్సూన్ ఈ ఘటనపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

