పుతిన్‌కు ప్రత్యేక బాడీగార్డ్.. అతను చేసే పనేంటో తెలుసా?
న్యూఢిల్లీ: వ్లాదిమిర్ పుతిన్ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. రష్యా అధ్యక్షుడి కోసం ఓ ప్రత్యేకమైన బాడీగార్డ్ కూడా ఉన్నాడు. పుతిన్ ఎక్కడికి వెళ్లినా ఆ బాడీగార్డ్ ఆయనేతోనే ఉంటారు. కానీ ఆ బాడీగార్డ్ చేసే పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పుతిన్ మలమూత్రాలను ఆ బాడీగార్డ్ సేకరిస్తుంటాడని తాజాగా ఓ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఫాక్స్ న్యూస్ దీనిపై ఓ కథనాన్ని రాసింది. అయితే పుతిన్ ఆరోగ్య రహస్యాలు తెలియకుండా ఉండేందుకు.. ఆయన ఎక్కడికి వెళ్లినా ఓ బాడీగార్డ్ పుతిన్ మలమూత్రాలను సేకరిస్తున్నట్లు ఆ కథనంలో చెప్పారు. ఉక్రెయిన్‌పై దాడికి వెళ్లిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం బాగా క్షీణించినట్లు ఇటీవల పుకార్ల వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య బలహీనతలు బయటపడకుండా ఉండేందుకు పుతిన్ మలమూత్రాలను బాడీగార్డ్ సేకరిస్తుంటాడని ఫ్రెంచ్ మ్యాగ్జిన్ పారిస్ మాక్ తెలిపింది.
విదేశీ ఇంటెలిజెన్స్‌కు ఆరోగ్య రహస్యాలు చిక్కవద్దు అని పుతిన్ ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు డీఐఏ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ రెబెకా కోఫ్లర్ తెలిపారు. రష్యాకు చెందిన ఫెడరల్ గార్డ్ సర్వీస్ ప్రత్యేక సూట్‌కేసును తీసుకువెళ్తుందని, ఆ సూట్‌కేస్‌లో పుతిన్ మలమూత్రాలను తిరిగి మాస్కోకు పంపిస్తారని ఫ్రెంచ్ పత్రిక తెలిపింది. ప్రత్యేక ప్యాకెట్లలో వ్యర్ధాలను ప్యాక్ చేసి, ఆ ప్యాకెట్లను బ్రీఫ్‌కేస్‌లో పెడుతారని మరో పత్రిక రాసింది. దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పుతిన్ ఇలాంటి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. పుతిన్‌కు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ రూమర్లను రష్యా అధికారులు కొట్టిపారేస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

