Putin @ G20 | జీ20 సమావేశాలకు పుతిన్ గైర్హాజరయ్యే అవకాశం..!
Putin @ G20 | మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న జీ20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గైర్హాజరు కానున్నారు. యుద్ధంపై పాశ్చత్య దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది.
Putin @ G20 | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జీ20 భేటీకి హాజరుకావడం లేదు. ఇండోనేషియాలోని బాలిలో ఈ నెల 15-16 తేదీలలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరుగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరుకాకూడదని పుతిన్ నిర్ణయించినట్లు ఏఎఫ్‌పీ వార్తాసంస్థ కథనం. అతడి స్థానంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ను భేటీకి పంపుతున్నారు. అయితే, ఈ సమావేశాలకు పుతిన్ హాజరయ్యే అవకాశాలను తోసిపుచ్చలేమని ఇండోనేషియాలోని రష్యన్ రాయబార కార్యాలయం ప్రోటోకాల్ చీఫ్ యులియా టామ్స్కాయ వెల్లడించారు.
ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా సైన్యం వెనుకంజ వేస్తున్న తరుణంలో జీ20లో చేరేందుకు బాలి వెళ్లకూడదని పుతిన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది. పాశ్చాత్య దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వాటి నివారణకు రష్యా మార్గాలను వెతుకుతున్నది. వాస్తవానికి, భారతదేశం, అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాల నాయకులు జీ20 సమావేశంలో పాల్గొంటారు. ఈ దేశాలు మొదటి నుంచి ఉక్రెయిన్‌తో యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నాయి. 9 నెలల తర్వాత కూడా యుద్ధం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి ఎదురయ్యే విమర్శలను తిప్పికొట్టేందుకు సరైన సమయం కానందున జీ20 సమావేశాలకు గైర్హాజరవడం ఒక్కటే మార్గమని రష్యా ఉన్నత వర్గాలు భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రతికా వందనం.. మెరిసిన శ్రీచరణి
బౌలర్లపైనే బెంగ.. నేడు న్యూజిలాండ్‌తో భారత్ రెండో టీ20
జర్నలిస్టు శంకర్‌కు 14 రోజుల రిమాండ్.. న్యూస్‌లైన్ ఎండీపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ జోడించిన పోలీసులు
ఇందిరమ్మ చీరలకు బిల్లుల గండం.. పెండింగ్‌లో రూ.120 కోట్ల బకాయి
జ్ఞానేశ్ ను ఎవరూ కాపాడలేరు.. వేలాదిమందితో ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

