రష్యా మిలిటరీ పుతిన్‌ను తప్పుదోవ పట్టించిందా ?
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై ఆక్రమణకు వెళ్లిన పుతిన్‌కు రష్యా సైన్యం తప్పుడు సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. రష్యా మిలిటరీ తనను తప్పుదారి పట్టించిందన్న ఆలోచనలో పుతిన్ ఉన్నట్లు అమెరికా పేర్కొన్నది. ఉక్రెయిన్‌పై రష్యా సమరానికి దిగి నెల రోజులు దాటింది. ఈ నేపథ్యంలో వైట్‌హౌజ్ ప్రతినిధి కేట్ బెడింగ్‌ఫీల్డ్ మీడియాతో మాట్లాడారు. మిలిటరీ తప్పుదోవ పట్టించినట్లు పుతిన్ భావించడం వల్లే.. ఆయనకు, ఆ దేశ మిలిటరీ నాయకత్వం మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయని అమెరికా అంచనా వేసింది. యుద్ధం విషయంలో పుతిన్ దారుణమైన వ్యూహాత్మక తప్పిదం చేశారని, ఎందుకంటే రష్యా చాలా బలహీనమైపోయిందని, ప్రపంచ వ్యాప్తంగా ఆ దేశం ఒంటరిగా మారిపోతోందని కేట్ అన్నారు.
పుతిన్‌కు సరైన సమచారం చేరకపోవడం పెద్ద సమస్యే అవుతుందని పెంటగాన్ ప్రతినిది జాన్ కిర్బీ తెలిపారు. సమాచారం లేకపోవడం వల్ల పుతిన్ నమ్మకం కోల్పోతారని, దాంతో శాంతి చర్చలకు విఘాతం ఏర్పాడే అవకాశాలు ఉన్నట్లు జాన్ చెప్పారు. తప్పుడు వార్తలపై పుతిన్ లాంటి నేతలు ఎలా రియాక్ట్ అవుతారో అంచనా వేయలేమన్నారు. ఉక్రెయిన్‌పై దాడికి వెళ్లిన రష్యాకు భారీ స్థాయిలో తప్పుడు సమాచారం వెళ్లినట్లు తేలిందని బ్రిటన్ సైబర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధిపతి జెర్మీ ఫ్లెమింగ్ తెలిపారు. బెదిరిపోయిన రష్యా దళాలు.. తమ స్వంత ఆయుధాలను, విమానాలను ధ్వంసం చేసుకున్నట్లు ఆయన ఆరోపించారు. పుతిన్ అడ్వైజర్లు ఆయనకు నిజం చెప్పడం లేదన్నారు. సరిపోను ఆయుధాలు లేక, ఆత్మస్థైర్యం కోల్పోయిన రష్యా సైనికులు.. సీనియర్ల ఆదేశాలను పాటించడం లేదని బ్రిటన్ ఏజెన్సీ పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

