లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 పార్దీవదేహానికి ఇవాళ అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే భారత్ తరపున నివాళి అర్పించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంగ్లండ్ వెళ్లారు. అయితే ఆదివారం బకింగ్ హామ్ ప్యాలెస్‌లో జరిగిన రిసెప్షన్లో కింగ్ ఛార్లెస్-3ని ద్రౌపది ముర్ము కలుసుకున్నారు. లాన్‌కాస్టర్ హౌజ్‌లో ఉన్న నివాళి బుక్‌లో ద్రౌపది సంతకం చేశారు. వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉన్న క్వీన్ ఎలిజబెత్-2 పార్దీవదేహానికి కూడా ముర్ము నివాళి అర్పించారు. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శనివారం లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి ముర్ము చేరుకున్నారు.
రాణి అంత్యక్రియలకు సుమారు 500 మంది ప్రపంచ దేశాధినేతలు హాజరుకానున్నారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, జపాన్ చక్రవర్తి నరుహితో, చైనా ఉపాధ్యక్షుడు వాంగ్ క్విషాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసోలు హాజరుకానున్నారు.