పాక్ ప్రధాని గురువారం సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని పాక్ మంత్రి ఫవాద్ చౌదరి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. నిజానికి.. బుధవారం రాత్రే ప్రధాని ఇమ్రాన్ పాక్ ప్రజలనుద్దేశించి ప్రసంగించాల్సి వుంది. అయితే హఠాత్తుగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. ఆర్మీ చీఫ్ బాజ్వా, ఐఎస్ఐ డీజీ బుధవారం ప్రధాని ఇమ్రాన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాతే ఇమ్రాన్ తన ప్రసంగ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవడం గమనార్హం. మరోవైపు గురువారం సాయంత్రం ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించనున్నారు.
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జాతీయ భద్రతా కమిటీతో ఇమ్రాన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారశాఖ మంత్రి ఫవద్ చౌదరీ తెలిపారు. ప్రధాని నివాసంలోనే ఆ మీటింగ్ జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న భద్రతా అంశాలను ఎన్ఎస్సీ కోఆర్డినేట్ చేస్తున్నది. ప్రధాని ఇమ్రాన్‌తో పాటు మరికొంత మంది కేంద్ర మంత్రులు ఈ మీటింగ్‌లో పాల్గొనున్నారు. ఇంటెలిజెన్స్‌తో పాటు త్రివిధ దళాధిపతులు కూడా దీంట్లో పాల్గొంటున్నారు.