వాషింగ్టన్ : మిస్సిసిపిలోని వాల్‌మార్ట్‌పై విమానంతో దాడి చేస్తానని ఓ పైలెట్ హెచ్చరించారు. దాదాపు గంట సేపటి నుంచి స్టోర్ పరిసరాల్లో విమానం చక్కర్లు కొడుతున్నది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వాల్‌మార్ట్ స్టోర్ సిబ్బందితో పాటు, కొనుగోలుదారులను స్టోర్ నుంచి బయటకు పంపించి వేశారు. వాల్‌మార్ట్ పరిసరాల్లోకి ఎవరూ రావొద్దంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే, వాల్‌మార్ట్‌ను ఉద్దేశపూర్వకంగానే వాల్‌మార్ట్‌ను ఢీకొడుతానని పైలెట్ హెచ్చరిస్తుండగా.. ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
ప్రస్తుతం పోలీసులు సదరు పైలెట్‌ను మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. పైలట్ టుపెలో విమానాశ్రయం నుంచి చిన్న విమానమైన బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్-90ని తీసుకువెళ్లినట్లు సమాచారం. ఈ విమానానికి రెండు ఇంజిన్లు ఉండడంతో పాటు తొమ్మిది సీట్ల సామర్థ్యం ఉన్నది. ప్రస్తుతం స్టేట్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎమర్జెన్సీ మేనేజర్స్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని గవర్నర్ టేట్ రీవ్స్ పేర్కొన్నారు.
Currently we have a 29yr old who stole this plane & is threatening to crash it into something. Polices ,ambulances ,& fire trucks are everywhere. Everything is shutdown rn pic.twitter.com/AzebdIa3tP
— City King (@CityKing_Gank_) September 3, 2022