Boris Johnson: లాక్డౌన్లో బోరిస్ జాన్సన్ మందుపార్టీ.. ఫోటోలు రిలీజ్
Boris Johnson: కరోనా లాక్డౌన్ సమయంలో బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ పార్టీలో మునిగితేలారు. ఆ పార్టీలకు చెందిన ఫోటోలను ఎంపీలు రిలీజ్ చేశారు. ప్రివిలేజ్ కమిటీ త్వరలో బోరిస్ను ఆ విషయంపై ఎంక్వైరీ చేయనున్నది.
లండన్: బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్(Boris Johnson) .. కరోనా లాక్డౌన్(Lockdown) సమయంలో మందు పార్టీలో పార్టిసిపేట్ చేశారు. టెన్ డౌనింగ్ స్ట్రీట్(Downing Street)లో జరిగిన ఆ పార్టీకి చెందిన ఫోటోలు ఇప్పుడు రిలీజ్ అయ్యాయి. గత నవంబర్లో ఆ కేసు విచారణ సమయంలో ప్రభుత్వ వర్గాలు ప్రివిలేజ్ కమిటీకి కొన్ని డాక్యుమెంట్లను అందజేసింది.
దాంట్లో డౌనింగ్ స్ట్రీట్ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలు ఉన్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సమయంలో ప్రధాని అధికారిక నివాసం డౌనింగ్ స్ట్రీట్లో మూడుసార్లు పార్టీలు జరిగినట్లు తెలుస్తోంది. 19 జూన్ 2020, 13 నవంబర్ 2020, 14 జనవరి 2021 తేదీల్లో ప్రధాని బోరిస్ పార్టీ ఇచ్చారని, దానికి కొందరు హాజరైనట్లు ఫోటోల ద్వారా తెలుస్తోంది.
మార్గదర్శకాల ప్రకారమే భేటీలు జరిగినట్లు ప్రధాని బోరిస్ చెప్పినా.. అక్కడ జరిగినదంతా విరుద్ధంగా ఉన్నట్లు ప్రివిలేజ్ కమిటీ అభిప్రాయపడింది. బోరిస్ మందుపార్టీలో మునిగిన ఫోటోలను ఎంపీలే రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

