5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు ఫైజర్ టీకా సురక్షితం

న్యూయార్క్: అయిదేళ్ల నుంచి 11 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్నారులకు తమ టీకా సురక్షితమని ఫైజర్ తెలిపింది క్లినికల్ ట్రయల్స్ ఫలితాల ద్వారా ఈ విషయాన్ని తేల్చారు. అయితే ఎమర్జెన్సీ వినియోగం కోసం దరఖాస్తు చేసుకోనున్నట్లు ఆ కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. ఫైజర్-బయోఎన్‌టెక్ కోవిడ్ టీకా 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు సురక్షితంగా, ప్రభావవంతంగా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. దానికి సంబంధించిన డేటాను ఆ కంపెనీ రిలీజ్ చేసింది. డెల్టా వేరియంట్‌ను కూడా స్టడీ చేశామని, పిల్లల్లో ఆ వేరియంట్ వల్ల ఉన్న భయాందోళనలకు ఫైజర్‌తో చెక్ పెట్టవచ్చు అని గుర్తించామని ఫైజర్ చైర్మెన్, సీఈవో ఆల్బర్ట్ బొరులా తెలిపారు.
అమెరికాలో జూలై నుంచి పీడియాట్రిక్ కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయి. సుమారు 240 శాతం కేసులు పెరిగినట్లు గుర్తించారు. దీంతో పిల్లలకు వ్యాక్సిన్ తప్పనిసరి అన్న నిర్ణయానికి వచ్చారు. అయితే ట్రయల్స్‌లో 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిలో 2268 మందికి టీకాలు వేశారు. రెండో డోసుల రూపంలో ఈ ట్రయల్స్ నిర్వహించారు. సాధారణంగా 12 ఏళ్ల పైబడిన వారికి ఇచ్చే డోసేజ్ కన్నా తక్కువ మోతాదులో పిల్లలకు టీకాలు ఇచ్చారు. పిల్లల్లో ఫైజర్ టీకా యాంటీబాడీలను పెంచుతున్నట్లు గుర్తించామన్నారు.
ఫైజర్ కంపెనీ తమ డేటాను అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏతో షేర్ చేసుకోనున్నది. యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీతో పాటు ఇతర రెగ్యులేటర్లకు కూడా తమ డేటాను అందజేయనున్నది. అమెరికాలో 16 ఏళ్లు దాటిన వారికి ఫైజర్ టీకాలు ఇస్తున్నారు. కొమిర్నాటీ పేరుతో ఆ టీకాలను మార్కెట్ చేస్తున్నారు. 12 నుంచి 15 ఏళ్ల వారిలో మాత్రం ఎమర్జెన్సీ వినియోగంగా వాడుతున్నారు. 2 నుంచి అయిదేళ్లు, ఆరు నెలల నుంచి రెండేళ్ల చిన్నారులకు కూడా టీకా ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు ఫైజర్ కంపెనీ చెప్పింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

