Colorado | అమెరికాలోని కొలరాడో (Colorado) రాష్ట్రంలో ఫైర్బాంబు దాడి జరిగింది. హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారి గురించి అవగాహన కల్పించడానికి నిర్వహించిన శాంతియుత కార్యక్రమంలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. పాలస్తీనాకు విముక్తి కల్పించాలంటూ (Free Palestine) మండే స్వభావం కలిగిన ద్రావణ సీసాలను విసిరాడు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని 45 ఏళ్ల మొహమ్మద్ సబ్రీ సోలిమాన్‌గా ఎఫ్‌బీఐ (FBI) అధికారులు గుర్తించారు. ఈ ఘటనను ఉగ్రదాడిగా అభివర్ణించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి సమయంలో పట్టుబడిన బందీలకు మద్దతుగా యూదులు వారానికి ఒకసారి సమావేశం నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఆదివారం ‘బౌల్డర్ రన్ ఫర్ దేర్ లైవ్స్’ పేరుతో కొలరాడోలో యూదులు సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సమయంలోనే మొహమ్హద్ సబ్రీ అనే వ్యక్తి పాలస్తీనాకు విముక్తి కల్పించాలని నినాదాలు చేస్తూ యాదుల గుంపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటనపై వైట్‌హౌస్ స్పందించింది. బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించింది.
Mohammad Soliman just lit a bunch of elderly Jews on fire in Colorado while shouting “Free Palestine”
Police: “Too early for a motive” pic.twitter.com/qElnrTTzwS
— End Wokeness (@EndWokeness) June 1, 2025
Also Read..
రష్యా వైమానిక స్థావరాలపైఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి
ప్రియుడిచ్చిన 30 కోట్ల లాటరీ డబ్బుతో మరో ప్రియుడితో పరార్!